హైదరాబాద్ లోని కేంద్ర రక్షణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను పాకిస్తానీ అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నారు. కంచన్‌బాగ్ డి అర్ డి ఎల్ లో తాజాగా బయటపడిన హనీ ట్రాప్ కేస్ లో కీలకాంశాలు బయటపడుతున్నాయి. డీఆర్‌డీఎల్‌లో క్వాలిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్న మల్లికార్జునరెడ్డిని హనీ ట్రాప్ చేసింది నటాషా అనే అమ్మాయి.
కె సీరీస్ మిస్సైల్ కు చెందిన కీలక సమాచారాన్ని నటాషాకు చేరవేశాడు మల్లికార్జునరెడ్డి. యుకే అనుసంద డిఫెన్స్ జర్నలిస్ట్ పేరుతో ట్రాప్ చేసింది నటాషా. రెండు సంవత్సరాలుగా నటాషాతో సంభాషణ చేశాడు మల్లికార్జున్ రెడ్డి. 2019 నుండి 2021 వరకు నటాషా కు మిస్సైల్ కాంపోనెంట్స్ కీలక డేటా చెరవేశాడు. సబ్ మెరైన్ నుండి మిస్సైల్స్ లాంచ్ చేసే కీలక K – సిరీస్ కోడ్ ను పాకిస్తానీ స్పై కు చేర్చాడు మల్లికార్జున్.
సిమ్రాన్ చోప్రా, ఒమిషా అడ్డి పేరుతో ఫేస్ బుక్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేసింది పాకిస్తానీ. ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా మల్లికార్జున్ కు మెసేజ్ లు పంపేది. మల్లికార్జున్ ఫోటోలు, వీడియోలు అడిగినా నటాషా అసలు పంపించలేదు. కేవలం చాటింగ్ తోనే మల్లికార్జున్ ను ట్రాప్ చేసింది నటాషా. ల్యాప్ టాప్ , మొబైల్ ఫోన్ లో మిస్సైల్ కు సంబంధించిన కీలక సమాచారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మల్లిఖార్జున్ రెడ్డికి చెందిన మొబైల్ లో నటాషా వాయిస్ రికార్డింగ్ లు సీజ్ చేశారు. ఇంగ్లీష్, హిందీ లో నటాషా వాయిస్ క్లిప్పింగ్స్ దొరికాయి. ఇప్పటికే మల్లికార్జున్ రెడ్డిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, అతడిని కస్టడీకి తీసుకోవాలని యోచిస్తున్నారు.
YCP : వెలుగు వెలిగిన ఆ మాజీ మంత్రి జంక్షన్ లోకి వచ్చి పడ్డారా.? l
