DOST 2022: డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలిలో డిగ్రీ దోస్త్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని 1060 కళాశాలల్లో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేషనల్, బీకాం హానర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇతర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 4,25,000 సీట్లను భర్తీ చేయనున్నారు. 3 లేదా 4 విడతల్లో డిగ్రీ సీట్లను భర్తీ చేయనున్నారు. దోస్త్ వెబ్ సైట్, టీఎస్ యాప్ ఫోలియో లేదా యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
అర్హత కలిగిన విద్యార్థులు జులై 1 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు జులై 3 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. జులై 22న సీట్ల కేటాయింపు ఉంటుంది. 23వ తేదీ నుంచి జులై 27వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టు చేయాలి. ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 7 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు చేపడతామని అధికారులు వెల్లడించారు. జులై 6 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకునేందుకు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ఆగస్టు 6న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈ కేటాయింపుకు సంబంధించి ఆగస్టు 7 నుంచి 18 వరకు విద్యార్థులు సంబంధిత కళాశాల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 7 నుంచి 21 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆగస్టు 7 నుంచి 22 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. ఆగస్టు 22న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉండనున్నట్లు షెడ్యూల్‌లో ప్రకటించారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ జరగనుండగా.. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 16న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉండనుంది. అక్టోబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు.
తాజావార్తలు
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!