చిల్లరమల్లరగా మాట్లాడితే ఊరుకోనే ప్రసక్తి లేదు.. మా వాణి కూడా వినిపిస్తామని మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో రూ.2.50 కోట్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక పిల్లల సంరక్ష ణ విభాగంతోపాటు పలు విభాగాలను శుక్రవారం కేటీఆర్ ప్రారంభించారు. బీసీ స్టడీ సర్కిల్‌లో చదువుకుంటున్న విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘కేంద్రానికి పన్నుల రూపం లో తెలంగాణ ఇచ్చిందే ఎక్కువ. తెలంగాణకు కేంద్రం నుంచి వ చ్చింది తక్కువ. దేశంలోని వెనకబడిన రాష్ట్రాలకు తెలంగాణ చెమట, రక్తం ఉపయోగపడుతున్నందుకు సంతోషపడుతున్నామని తెలిపిన కేటీఆర్.. కొందరు ఇక్కడికొచ్చి చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇవ్వనివి ఇచ్చినట్లు చెబుతున్నారు. విమర్శలు చేస్తే పర్లేదు కానీ.. రాజకీయ భావదారిద్య్రంతో మాట్లాడితే ఊరుకోం. వారందరికి మావాణి వినిపించాల్సి వుంటుందని మండిపడ్డారు. తాజాగా నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో బెస్ట్ పర్‌ఫార్మెన్స్ విభాగంలో దేశంలోనే మొదటి ర్యాంకు.. జనరల్‌లో రెండో ర్యాంకు సాధించడం గర్వకారణమని తెలిపారు.
కాగా.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 12 మున్సిపాలిటీలతోపాటు 10గ్రామాలు.. 19 పంచాయతీలు అవార్డులు అందుకోవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. అయితే.. ఆర్థికాభివృద్ధిలోనూ తెలంగాణ 4వ స్థానంలో ఉందని వెల్లడించారు. అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, కర్ణాటకసహా పలురాష్ట్రాలకు తెలంగాణ నుంచి నిధులు వెళ్తేనే పనులు జరిగే పరిస్థితి ఉందన్నారు. దీంతో.. భారత జాతి నిర్మాణానికి తెలంగాణ దోహదపడుతుంటే ఇక్కడ కొంతమంది మిడిమిడి జ్ఞానంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ చేపట్టిన పల్లె గోస- జనం గోస యాత్ర పై మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా పల్లె గోస పడడం లేదని, జనం గోస అసలే లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు చైతన్య వంతులని.. నోటితో నవ్వుతూ.. నొసటితో వెక్కిరించేవారిని నమ్మరని కేటీఆర్ ఎద్దేవ చేసారు. బీజేపీ మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించవచ్చని అనుకుంటున్న వారే అమాయకులుగా మిగిలిపోతారన్నారని విమర్శించారు కేటీఆర్.
CJI Justice NV Ramana: మీడియా కంగారు కోర్టులను నడిపిస్తోంది.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఫైర్