NTV Telugu Site icon

Dogs Attacking Deers: అనంతగిరిలో దారుణం.. జింకలను పీక్కుతింటున్న కుక్కలు

Dogs Attaks Deers

Dogs Attaks Deers

Dogs Attacking Deers: అనంతగిరిలో దారుణం చోటుచేసుకుంది. వీధి కుక్కలు జింకలను చంపి తింటున్నాయనే వార్త పర్యటకులకు షాక్‌ కు గురిచేశాయి. అనంతగిరిలో శని, ఆదివారల్లో పర్యటకులు పెద్ద సంఖ్యలో వెళ్ళి అక్కడ వున్న వాతావరణాన్ని ఆశ్వాదిస్తూ ఆనందాన్ని పొందుతారు. అయితే అక్కడున్న పచ్చని చెట్లకు జింకలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ పర్యాటకులు ఆనందాన్ని కలిగిస్తుంటాయి. వాటిని చూడటానికి కూడా అనంతగిరికి చాలామంది వెళుతుంటారు. అయితే అక్కడ కుక్కలు జింకలు చంపి తింటున్నాయనే వార్త స్థానికులకు, పర్యటకులకు భాయాందోళన కలిగిస్తోంది. గురువారం ఉదయం అనంతగిరి ఆలయ పుష్కరిణి సమీపంలో జింక కనిపించింది. చెంగు చెంగు మంటూ వెళుతున్న జింకను చూసిన వీధి కుక్కలు దాని వెంట పడ్డాయి. అయితే జింక భయంతో పరుగులు పెట్టుందుకు ప్రయత్నించింది.

Read also: Hackers: పోలీస్ యాప్ నే హాక్ చేసిన కేటుగాళ్లు.. ఆన్ లైన్ లో డేటా సేల్‌..

ఇంతలోనే కుక్కులు గుంపు జింకను వెంటాడాయి. చివరకు జింకను వేటాడ కుక్కులు చంపి పీక్కుతిన్నాయి. దీన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలు కూడా బయట ఆడుకుంటూ గడుపుతుంటారని కుక్కలు పిల్లలపై దాడి చేస్తే ఎలా అంటూ భాయందోళన చెందుతున్నారు. కాగా.. అనంతగిరిలో వీధి కుక్కలు పదుల సంఖ్యలో ఉంటాయని అంటున్నారు. ఉదయం అడవిలో తిరుగుతూ కనిపించిన మూగ జీవాలను వెంటాడి చంపుతున్నాయని అన్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి కుక్కల బారి నుంచి జింకలు, అడవి జంతువుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. లేకుంటే.. జంతువులపై కాకుండా.. పర్యాటకులకు కూడా హాని చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయని తెలిపారు.
Secunderabad: పోలీసులను చూసి భవనం పైనుంచి దూకిన వ్యక్తి.. తరువాత..