హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై కుక్కలు దాడి చేశాయి. పాతబస్తీలోని యాకుత్ పుర మదీనా కాలనీలో ఓ యువకుడు పదుల సంఖ్యలో కుక్కల సాకుతున్నాడు. వాటిని రోెడ్లపై వదులుతుండటంతో.. అవి పాదచారులపై దాడి చేస్తున్నాయి.
మదీనా కాలనీ నుంచి నడుచుకుంటూ వెలుతున్న ఒక ముస్లీమ్ మహిళపై కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేశాయి. గమనించిన స్థానికులు వాటిని తరిమిన వారి మీద కూడా దాడిచేసాయి. విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించిన మహిళ చేతికి పట్టుకుని ఓసునకం ఘోరంగా దాడి చేయడంతో.. ఆ మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృష్యాలు సీసీ ఫోటేజీలో రికార్డు కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ ఫోటేజ్ చూసిన స్థానికులు నిర్థాంతపోయారు. ఈ విషయాన్ని కుక్కల యజమానికి చెప్పిన పట్టించుకోలేదు.
దీంతో కాలనీ వాసులు మాట్లాడుతూ.. పాదచారులపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్నాయని, వారికి భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయని వాపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే మదీనా కాలనీ ప్రజలు బెంబేలెత్తు తున్నామని తెలిపారు. కుక్కలు.. పిల్లలపై దాడి చేస్తే దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బయటకు అడుగు పెట్టాలంటేనే భయంగా వుందని, కుక్కల యజమానికి చెప్పిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కుక్కలను వేరే ప్రాంతానికి మార్చాలని కోరతున్నారు. దీనిపై పోలీసులకు ప్రశ్నించగా దీనిపై ఎటువంటి సమాచారం లేదని, వారికి అసలు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని స్థానిక పోలీసులు అంటున్నారు.
Tamota Prices: వామ్మో.. రూ.100 దాటిన టమోటా ధర
వీధి కుక్కల దాడిలో అభంశుభం తెలియని ఓ చిన్నారి ప్రాణాలను విడిచిన ఘటన 2022 ఏప్రిల్ 27న గోల్కొండ లో చోటుచేసుకుంది. గోల్కొండ బడాబజార్ లో ఓ కుటుంబం నివాసముంటోంది. ఈ కుటుంబానికి చెందిన రెండేళ్ల బాలుడు అనస్ అహ్మద్ ఇంటిబయట ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధికుక్కలు దాడిచేసాయి. దాంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తల్లిదండ్రులు బాలున్ని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్య లోనే మృతిచెందాడు.. వైద్యులు పరిసిలించి బాలుడు మృతి చెందినట్లు తెలిపారు.
కుక్కలు స్వైరవిహారం చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని, అందుకే కుక్కల దాడిలో రోజు రొజుకోరు ప్రాణాలను కొల్పొతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోకుండా ఉంటే మరింత మందిపై కుక్కలు దాడిచేస్తాయని, కుక్కలతో వారికి ప్రమాదం ఉందని వాపొతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలపైనే జిహెచ్ఎంసి, ప్రభుత్వం దృష్టి పెట్టిందని మిగిలిన ప్రాంతాల ను కనీసం పట్టించుకోకుండా ఉందని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ కుక్కల సమస్యపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.