NTV Telugu Site icon

హెల్మెట్లతో వైద్యులు.. రక్షణ కోసమేనా..?

వైద్యులు హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఈ దృశ్యం కన్పించింది. నిన్న ఆస్పత్రిలో సీలింగ్‌ ఫ్యాన్‌ ఊడిపడి ఓ వైద్యురాలి తలకు గాయమైంది. దీంతో వైద్యులు ఈ రోజు హెల్మెట్లు ధరించి ఆస్పత్రిలో విధులకు వచ్చారు. ఆస్పత్రిలో శిథిలమైన సీలింగ్‌ ఫ్యాన్లను చూసి భయపడుతున్నారు.

ఎప్పుడు, ఎక్కడా ఏ ఫ్యాన్‌ ఊడి మీద పడుతుందోనని భయాందోళనలు చెందుతున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో రోగులకు, వైద్యులకు రక్షణ లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకుని, ఆస్పత్రిలో మౌలిక సౌకర్యాలను మెరుగు పర్చాలని కోరుతున్నారు. ఆస్పత్రిలో చాలా వరకు భవానాలు దెబ్బతీన్నాయని కొత్త భవనాలు నిర్మించాలని వైద్యులు కోరుతున్నారు.