BJP National Vice President DK Aruna About Mahila Bandhu.
సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ను ఫామ్ హౌస్ కి పంపించాలని, బడ్జెట్ బ్రహ్మ పదార్థం కాదు అన్న కేసీఆర్ అసెంబ్లీని కేవలం వారంలో ముగించారని ఆమె విమర్శించారు. ఆ మాత్రం దానికి సభ ఎందుకు.. ఫామ్ హౌజ్ లో ఉండి పేపర్ల మీద సంతకాలు పెడితే చాలదా అని ఆమె ఎద్దేవా చేశారు. ధర్నా చౌక్ ఎత్తేసిన కేసీఆర్ అదే చోట దీక్ష చేశారు.. కొంచెమైనా సిగ్గు అనిపోయించలేదా కేసీఆర్ అని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ ను ప్రశ్నించే వారిపై పోలీసు కేసులు పెట్టించి హత్యా నేరాలు మోపడనికా తెలంగాణ తెచ్చిందని ఆమె అగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే స్థానానికి సమీపంలో ఉన్న దుబ్బాక లో బీజేపీ ని గెలిపించారని ఆమె గుర్తు చేశారు. పాలమూరులో నియంత కేసీఆర్ ని మించిన మంత్రి పాలన నడుస్తుందని, హుజురాబాద్ లో కోట్లు కుమ్మరించినా ఈటలకే పట్టం కట్టారని ఆమె అన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో చేసిన హామీలన్నీ మోసమేనని, ఇన్ని రోజుల్లో మహిళల గురించి ఎన్నడూ పట్టించుకోలేదు కానీ మొన్న మహిళ దినోత్సవం రోజు మహిళా బంధు అని పెట్టారన్నారు. గవర్నర్ ఒక మహిళ.. ఆమెను గౌరవించడం కూడా తెలియని నీకు మహిళా బంధు అనిపెడితే ప్రజలు నమ్ముతారా అని ఆమె ప్రశ్నించారు.
