మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం కేసుపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర స్క్రిప్ట్ చదివారు. నేను మున్నూరు రవి కి ఆకామిడేషన్ ఇచ్చాను. షెల్టర్ ఇవ్వలేదు. ఆయన తెలంగాణ ఉద్యమ కారుడు. మళ్ళీ కూడా ఆకామిడేషన్ ఇస్తాను. నా పీఏ ను కాంటాక్ట్ అయ్యాడు. మున్నూరు రవి మొదటి సారి ఉండలేదు… ఇంతకు ముందు కూడా ఉన్నాడు. మున్నూరు రవి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పై ఎలాంటి ఆరోపణలు లేవు. ఇప్పుడు ఆయన మీద జబర్దస్తు గా కేసులు పెట్టారు. నా డ్రైవర్ ఏం తప్పు చేసాడు. శ్రీనివాస్ గౌడ్ ని ఎందుకు మర్డర్ చేయాలని అనుకుంటున్నారు?అన్నారు జితేందర్ రెడ్డి.
వాళ్ళంతా టీఆర్ఎస్ కార్యకర్తలు. వారు ఎందుకు హత్యకు ప్లాన్ చేశారు? కేసీఆర్ కు భయం పట్టుకుంది. బీజేపీ ఎదుగుతుంటే నేతల పై కక్షలు తీర్చుకుంటారు. నా గురించి కేసీఆర్ నీకు తెలియదా? రాళ్లతో కొట్టించడం తెలంగాణ సంస్కృతా? ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు జితేందర్ రెడ్డి.
