ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బాధ్యత వహించిన మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని చేజిక్కించుకుని విజయం సాధించిన బీజేపీ ఎంపీ డీకే అరుణతో ఎన్టీవీ ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నా గెలుపును అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 సార్లు వచ్చి సభలో పెట్టిండని, వ్యక్తి గతంగా నన్ను రేవంత్ రెడ్డి దూషించాడని ఆమె మండిపడ్డారు. అనేక రకాలుగా భయబ్రాంతులకు గురి చేశాడని ఆమె ఆరోపించారు. డీకే అరుణ ను గెలిపిస్తే ముఖ్యమంత్రిగా నా ఇమేజ్ తగ్గుతుందని రేవంత్ రెడ్డి చెప్పాడని, అయినా కూడా మహబూబ్ నాగర్ ప్రజలు నాకు పట్టం కట్టారన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని కావాలని మహబూబ్ నగర్ ప్రజలు కోరుకున్నారని, బీఅర్ఎస్ ఓట్ల వల్లే బీజేపీ గెలిచిందనేది పచ్చి అబద్ధమని ఆమె అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌పై వ్యతిరేకతతో కాంగ్రెస్ కి ఓటు వేస్తే లక్కీగా రేవంత్ ముఖ్యమంత్రి అయ్యిండని ఆమె అన్నారు.
ఓటర్లను అవమణించినట్లు రేవంత్ వాక్యాలు ఉన్నాయని, తనని తానూ సమర్ధించుకోవడానికి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడన్నారు. ప్రజలు మోడీని వ్యతిరేకించలేదని, తెలంగాణ ఎన్నికల్లో 14 సీట్లు సాధించడం రేవంత్ రెడ్డి రెఫరెండం అని చెప్పాడన్నారు డీకే అరుణ. 8 స్థానాలే గెలవడం పై రేవంత్ రెడ్డి రెఫరెండం పై వివరణ ఇవ్వాలని, నరేంద్ర మోది పై మాట్లాడడం ఆకాశం పై ఉమ్మి వేయడమేనన్నారు. ప్రధాని నిర్ణయంపైనే నా మంత్రి పదవి ఆధారపడి ఉందని, మోడీ ఏ భాద్యతలు అప్పగించినా పనిచేయడానికి నేను సిద్ధమని ఆమె తెలిపారు. నా మంత్రి పదవికి పురంధేశ్వరికి ఎలాంటి పోటీ లేదని ఆమె అన్నారు.
