DK Aruna: ఆ మూడు పార్టీ లు ఒక్కటే.. ఎవరు ఎవరితో కలిశారు అనేది ఇప్పుడు కనిపిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో దుస్ప్రచారమ్ చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై, అవినీతిపై పోరాటం చేసింది బీజేపీ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఆ మూడు పార్టీ లు ఒక్కటే.. ఎవరు ఎవరితో కలిశారు అనేది ఇప్పుడు కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ లో మెజారిటీ సీట్లను గెలుచుకుంటుందని తెలిపారు. కామారెడ్డిలో బీజేపీ గెలిచిందని అన్నారు.
Read also: KTR: ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూస్తాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మేము ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదని అన్నారు. విశ్లేషించుకుంటామని తెలిపారు. లక్షల కోట్లు అప్పులు ప్రభుత్వం చేసిందని కాంగ్రెస్ ఆరోపించిందని మండిపడ్డారు. అప్పులు ఉన్నాయని తెలిసిన కాంగ్రెస్ ఉచిత హామీలు ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితాలు ప్రకటించి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ ఓట్లు పొందిందని తెలిపారు. అప్పుల షాకు చెప్పి హామీలను నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. నరేంద్ర మోడీ గ్యారంటీ కి ఇతర పార్టీ ల గారడీ లకు తేడా గమనించి ప్రజలు మూడు రాష్ట్రాల్లో బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో నే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని తెలిపారు.
KTR: ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూస్తాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు