సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీపావళి పండుగ పురస్కరించుకొని దేశ ప్రజలకు బహుమతిగా పెట్రోల్ డీజిల్ ధరల పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని డీకే అరుణ అన్నారు.
Also Read : హైదరాబాద్ కు ఈటల.. సిద్ధిపేటలో ఆగి ఏం చేశారంటే..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కనీసం అభినందించకపోగా, టీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని డీకే అరుణ నిప్పులు చెరిగారు. ఎన్డీయే పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వ్యాట్ ను తగ్గించి వారి రాష్ట్ర ప్రజలకు భారం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే, మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రం అసలు సోయి కూడా లేదని డీకే అరుణ ఘాటుగా విమర్శించారు.
ఇన్ని రోజులు పెట్రోల్ డీజిల్ ధరల తగ్గించాలంటూ ప్రజల పై ప్రేమ ఉన్నట్లు నటించి, మోత్తుకున్న టీఆర్ఎస్ నాయకుల, ఇప్పుడు ఎక్కడ పారిపోయారు అని డీకే అరుణ ప్రశ్నించారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి, ప్రజల శ్రేయస్సు కోసం పెట్రోల్, డీజిల్ ధరల పై వ్యాట్ ను తక్షణమే తగ్గించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.