NTV Telugu Site icon

Voter Slips: నవంబర్‌ 10 తర్వాత ఓటరు స్లిప్‌లు.. ముందు రోజే పోస్టల్‌ బ్యాలెట్‌..!

Voter Slips

Voter Slips

Voter Slips: ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ అన్నారు. ప్రతి పది నుంచి 12 పోలింగ్‌ కేంద్రాలకు ఒక సెక్టోరల్‌ అధికారిని నియమించినట్లు రొనాల్డ్‌రాస్‌ తెలిపారు. సెక్టోరల్ అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని మూడుసార్లు సందర్శించి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, ఇంటర్నెట్, సాకెట్లు, మరుగుదొడ్లు తదితరాలు ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఎన్నికలలో పాల్గొనే సిబ్బందికి ముందు రోజు పోస్టల్ బ్యాలెట్

ఎన్నికలలో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి ముందురోజు పోస్టల్ బ్యాలెట్ అందజేస్తామని, అదే రోజు అందజేస్తామని రొనాల్డ్రాస్ తెలిపారు. ఈ ఎన్నికల్లో మహిళా పోలింగ్ సిబ్బంది పోలింగ్ రోజు ఉదయం 5 గంటలకు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో రిపోర్టు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిందని తెలిపారు. సెక్టోరల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బంది సమాచారాన్ని కలిగి ఉండాలి. పోలింగ్‌కు వారం రోజుల ముందు సెక్టోరల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు ఉంటాయని, ఎన్నికలకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ కేంద్రాలకు రూట్ మ్యాప్ సిద్ధం చేసి సిద్ధంగా ఉంచాలన్నారు.

నవంబర్ 10 తర్వాత ఓటరు స్లిప్పులు

నవంబరు 10 తర్వాత బీఎల్‌ఓలు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేస్తారని రొనాల్‌డ్రాస్ తెలిపారు.ఈసారి ప్రతి ఇంటికీ కొత్త ఓటరు సంబంధిత సమాచారాన్ని స్టిక్కర్ల రూపంలో అతికించనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య తలెత్తినా సెక్టోరల్ అధికారులు సమస్యను పరిష్కరించాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులు ఈవీఎంల పనితీరు గురించి సెక్టోరల్ అధికారులకు తెలియజేయాలి. త్వరలో ఈవీఎంల కమీషన్‌పై అవగాహన కల్పిస్తామని చెప్పారు. పోలింగ్ రోజు ముందు మాక్ పోల్ నిర్వహించాలని, పోలింగ్ సమయం ముగిసిన తర్వాత క్యూలో నిలబడిన వారందరూ ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజున మాక్ పోల్ రిపోర్టు, ఓటర్ టర్నౌట్ రిపోర్టు, ఇతర నివేదికలను ప్రిసైడింగ్ అధికారి సెక్టోరల్ అధికారికి డీఈవోకు పంపిస్తారని తెలిపారు.
Navaratri 7th Day: నవరాత్రులలో ఏడో రోజు.. శ్రీ లలితా త్రిపురసుందరీదేవి రూపంలో పూజలు