NTV Telugu Site icon

Telangana:ఓయూ విద్యార్థులు బీ..అలర్ట్‌.. పరీక్షలు వాయిదా..

???????? ?????? ?????????????

???????? ?????? ?????????????

ఉస్మానియ యూనివర్సీలో డిస్టేన్స్‌ ఎడ్యుకేషన్‌ చేస్తున్న విద్యార్థుకుల కీలక ప్రకటన చేసింది ఓయూ. ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్‌ జి. రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (పీజీఆర్‌ఆర్‌సీడీఈ) ద్వారా అందించే అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ నగేశ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

బీఏ, బీకామ్‌, బీబీఏ తదితర కోర్సుల పరీక్షలను ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ, ఈ పరీక్షలను 26వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రొఫెసర్‌ నగేశ్‌ చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్న ప్రొఫెసర్‌ నగేశ్‌… ఇతర వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు. అయితే ఇప్పటికే తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

అయితే .. 7 Jan 2022 న ఉస్మానియా, జేఎన్‌టీయూ వర్సిటీ పరీక్షలతో పాటు ఇగ్నో తదితర పరీక్షలు వాయిదా పడ్డాయి. దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా పడనున్నాయి. ఈ జాబితాలోకి ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) కూడా చేరింది. వర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు IGNOU తాజాగా ప్రకటించింది. 2021 డిసెంబర్ కు(December) సంబంధించిన ఈ టర్మ్ ఎండ్ పరీక్షలు తదుపరి నోటీసు ఇచ్చేంతవరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం వాయిదా పడిన ఇగ్నో టర్మ్ ఎండ్ పరీక్షలు(IGNOU TEE) 2022 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 23 వరకు జరగాల్సి ఉంది. తాజాగా పరీక్షలు వాయిదా పడినే నేపథ్యంలో విద్యార్థులు ఎప్పటికప్పుడు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్‌ http://ignou.ac.in/ చెక్‌ చేసుకుంటూ ఉండాలని సూచించింది.

తెలంగాణలో జనవరి 8 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో జేఎన్‌టీయూ, ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఎన్‌టీయూ పరిధిలో జనవరి 10 – 12 మధ్య జరగాల్సిన బీటెక్‌, బీ ఫార్మసీ పరీక్షలు జనవరి 19 -21 మధ్య జరుగుతాయని వర్సిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బీటెక్‌, బీ ఫార్మసీ 3, 4 సంవత్సరాల సప్లిమెంటరీ పరీక్షల రిజిస్ట్రేషన్‌ తేదీలను మార్చినట్లు వివరించారు.

ఇక ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జనవరి 8-16 మధ్య జరగాల్సిన అన్నీ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తదుపరి పరీక్షలు జరుగు తేదీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
Boris Johnson : వర్క్‌ ఫ్రం హోంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు..