Site icon NTV Telugu

Disha Encounter: దిశ ఎన్ కౌంటర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi

Asaduddin Owaisi

దేశవ్యాప్తంగా సంచలన రేపిన దిశ ఎన్ కౌంటర్ పై తాజాగా ఈ రోజు సుప్రీం కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. హైకోర్ట్ కు ఈ కేసును బదిలీ చేసింది. మరోవైపు దిశ ఎన్ కౌంటర్ పై నియమించిన సిర్పూర్కర్ కమిషన్ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. దిశ ఎన్ కౌంటర్ పూర్తిగా బూటకమని.. పోలీసులు చట్టబద్ధం నడుచుకోలేదని ఆరోపించింది. ఎన్ కౌంటర్ లో పాలుపంచుకున్న 10 మంది పోలీసులపై హత్యా నేరాన్ని నమోదు చేయాలని సిఫార్సు చేసింది.

తాజాగాా దిశ ఎన్ కౌంటర్ పై స్పందించారు ఎంఐంఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. తాము ఎన్ కౌంటర్లకు వ్యతిరేఖం అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ తుపాకులతో నడపొద్దని, చట్ట ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన  అన్నారు. ఎన్ కౌంటర్ చట్ట పాలనను బలహీనం చేస్తుందని అసద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరోవైపు జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై మరోసారి స్పందించారు అసదుద్దీన్ ఓవైసీ. స్థానిక జిల్లా కలెక్టర్ పిటిషన్లకు సహకరించారని.. ఇది విచారకరం అని అన్నారు. మతపరమైన ఆచారాలను అనుమతించాలని సుప్రీం కోర్ట్ చెబితే… వాజు అందులో భాగంగానే ఉంటుందని… వాజు కోసం ఉపయోగించే బావిని తెరవాలి, ఏదైతే పౌంటైన్ బయటపడిందో దాన్ని భద్రపరచవచ్చని అసదుద్దీన్ అన్నారు. భవిష్యత్తులో ఇలాాంటి వివాదాలు తలెత్తకకుండా ఉండేందుకు పూజా స్థలాల చట్టం 1991 రూపొందించారని… ఈ చట్టం రాజ్యంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని గతంలో సుప్రీం కోర్ట్ రామమందిర విచారణ సందర్భంగా పేర్కొందని ఆయన అన్నారు. కోర్ట్ తీర్పు ప్రకారం అంతా నడుచుకోవాలని ఆయన సూచించారు.

 

 

Exit mobile version