Site icon NTV Telugu

Disha Encounter : హైకోర్టుకు చేరిన దిశ ఎన్‌కౌంటర్‌ నివేదిక.. వాట్‌ నెక్ట్స్‌..

Maxresdefault Live

Maxresdefault Live

సుప్రీంకోర్టు శుక్రవారం దిశ ఎన్‌కౌంటర్ కేసుపై విచారణ చేపట్టింది. సిర్పూర్‌కర్‌ హైపవర్ కమిషన్ నివేదికపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ విచారణకు అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కూడా హాజరయ్యారు. విచారణ అనంతరం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశ ఎన్‌కౌంటర్ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మానిటర్ చేయలేదని కోర్టు తేల్చిన సుప్రీం.. ఈ కేసును రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది.

చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సుప్రీం కోర్టు వెల్లడించిన సుప్రీం.. దోషులు ఎవరన్నది కమిషన్ గుర్తించామని, సిర్పూర్కర్ కమిషన్ నివేదిక కాపీలను ఇరు వర్గాలకు ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఎన్‌కౌంటర్ ఘటన నివేదిక ద్వారా దోషులెవరో తేలిపోవడం, సుప్రీం కోర్టు ఈ కేసును రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయడంతో ఘటనలో పాల్గొన్న పోలీసుల్లో టెన్షన్ నెలకొంది. అయితే తాజా సిర్పూర్‌కర్‌ కమిటీ నివేదిక తెలంగాణ హైకోర్టుకు చేరింది. దీంతో నేడు హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Exit mobile version