Manikrao Thakre: తెలంగాణలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్ రావ్ థాక్రే రెండోరోజు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ గాంధీ భవన్ లో పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర పై చర్చించనున్నారు. రేవంత్ పాదయాత్ర పై చర్చకు పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రేవంత్ 26 నుండి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర అంటున్నవిషయం తెలిసిందే. అయితే కొందరు సీనియర్లు అధిష్టానం అనుమతి లేదంటున్నారు. అయితే ఇవాళ కార్యవర్గ సమావేశం తరవాత రేవంత్ పాదయాత్ర పై క్లారిటీ వచ్చే అవకాశాలు వున్నాయి.
Read also: Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?
నిన్న గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతో కూడా కోమటిరెడ్డి భేటీ అయ్యారు. వీరి భేటీ తర్వాత కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ ఎదుట వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో అందరికీ గౌరవం దక్కాలి. అందరి సమష్టి నిర్ణయాలు ఉండాలి. ఇవన్నీ జరిగితే నేను మరింత ఉత్సాహంతో పనిచేస్తాను అని చెప్పాను. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ప్రజల మనసులో ఉంది. హాత్ సే జోడో యాత్ర ఎలా చేయాలనే అంశంపై చర్చించామన్నారు. నాకు, రేవంత్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కాంగ్రెస్ బలమైన పార్టీ. బీఆర్‌ఎస్ వైఫల్యాలపై పోరాడుతాము అని స్పష్టం చేశారు.
Read also: Old City Hyderabad: గొడవలకు అడ్డాగా పాతబస్తీ.. పార్కింగ్ విషయంలో తల్వార్లతో దాడులు
కేసీఆర్ ఏ సమయంలోనైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ, విశ్వాసం వుందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేసేందుకు కృషి చేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. అంతర్గత విషయాలను పక్కనబెట్టి.. 60 నుంచి 70 శాతం ఎమ్మెల్యే అభ్యర్ధులను ముందుగానే డిసైడ్ చేయాలని ఆయన కోరారు. ఎన్నికలు 15 రోజులు వుండగా టికెట్లు ఇవ్వడం సరికాదని.. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి ఎప్పుడో తీసుకెళ్లానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. పోటీ ఉన్న చోట నేతలను కూర్చోబెట్టి మాట్లాడాలని, ప్రభుత్వం వస్తే వాళ్లలో ఒకరికి ఎమ్మెల్సీ, నామినేటెడ్, ఛైర్మన్ పోస్టు ఇస్తామని హామీ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించాలని కోమటిరెడ్డి అన్నారు. నేతలకు అన్ని రకాలుగా అండగా వుండి ప్రజా ఉద్యమాలు చేయాలని కోమటిరెడ్డి కోరారు. 9 ఏళ్ల నుంచి డీఎస్సీ లేదని ఆయన మండిపడ్డారు. గాంధీ భవన్‌కి రావడం తగ్గించి, నియోజకవర్గంలో ఎక్కువ సమయం వుండాలని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఇన్‌ఛార్జ్ కూడా జిల్లాల వారీగా తిరగాలని చెప్పానని కోమటిరెడ్డి తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు 40-50 సీట్లు వస్తాయన్నారు.
Wedding Shoot: ఫ్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళుతుండగా విషాదం.. కారులో వున్న ఐదుగురు మృతి