నా లైఫ్ ఇంకా ముత్యాల ముగ్గు హీరోయిన్ లాంటిదే అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టెర్రరిస్టు విధానాలకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నారు. అందుకే.. ఇందిరా.. రాజీవ్ గాంధీ లు బలి అయ్యారన్నారు.
తెలంగాణలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్ రావ్ థాక్రే రెండోరోజు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ గాంధీ భవన్ లో పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర పై చర్చించనున్నారు. రేవంత్ పాదయాత్ర పై చర్చకు పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.