Digvijay Singh To Observe Telangana Congress Situation: తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న వ్యవహారాలపై కాంగ్రెస్ హై కమాండ్ ఫోకస్ పెట్టింది. సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దింపింది. ఆయన్ను పరిశీలకుడిగా నియమించింది. ఈ నేపథ్యంలోనే ఆయన భట్టి విక్రమార్క, ఉత్తర్ కుమార్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలకు ఫోన్ చేశారు. ప్రస్తుతం తాను రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్రలో ఉన్నానని, ఒకట్రెండు రోజుల్లో హైదరాబాద్ వస్తానని, ఇవాళ సాయంత్రం జరగాల్సిన సీనియర్ నేతల సమావేశాన్ని వాయిదా వేయాలని చెప్పారు. ఉత్తమ్‌తో ఆయన పది నిమిషాల పాటు మాట్లాడారు. అధిష్టానం తనని పరిశీలకుడిగా హైదరాబాద్ వెళ్లమని చెప్పిందని, నగరానికి వచ్చాక అందరి అభిప్రాయాలు తీసుకుంటానని, అన్ని విషయాలు చర్చించుకుందామని, హైకమాండ్ తనని నివేదిక ఇవ్వమని కోరిందని ఉత్తమ్‌తో దిగ్విజయ్ అన్నారు. అయితే.. దిగ్విజయ్‌ను పరిశీలకుడిగా నియమించడం పట్ల కొందరు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
CP Mahesh Bhagwat: ఇంటర్నేషనల్.. ఇంటర్‌స్టేట్ డ్రగ్ రాకెట్స్‌ని పట్టుకున్నాం
మరోవైపు.. భట్టి విక్రమార్క నివాసంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, కోదండరెడ్డి భేటీ అయ్యారు. వీరి మధ్య గంటపాటు చర్చలు సాగాయి. ఈ భేటీ అనంతరం మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. రెండు రోజుల నుండి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తాము చర్చించుకున్నామని తెలిపారు. కాంగ్రెస్‌లో ప్రజస్వామ్యం ఎక్కువని, అన్ని విషయాలు మాట్లాడుకోవడం అలవాటని చెప్పారు. తమ మధ్య విభేదాలు రగిలిపోతున్నాయని మిగిలిన పార్టీలు భ్రమ పడుతున్నాయని, తమ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మాట్లాడుకొని వాటిని పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. త్వరలోనే ప్రస్తుత పరిస్థితులు సర్దుకుంటాయన్నారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రాజస్థాన్‌లోని రాహుల్ గాంధీని కలిశారు. అనంతరం.. పార్టీలో అంతర్గత వ్యవహారాలు, విభేదాలపై అధిష్టానంతో చర్చించేందుకు వెళ్లారు. ఇప్పటికే సోమవారం రాత్రి రెండు గంటల పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయన సూచన మేరకు రాహుల్‌ని మాణిక్కం కలిశారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రణాళికపై చర్చలు జరిపారు.
Srinivas Goud: పక్క రాష్ట్రమైనా, సొంత రాష్ట్రమైనా.. నకిలీ మద్యం చేస్తే వదిలే ప్రసక్తే లేదు
