బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు అమ్ముడుపోయారని, ఆయనకు చెంచాగిరి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కేసీఆర్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ ఓ తాగుబోతు ముఖ్యమంత్రి అని… టీఆర్ఎస్ కార్యకర్తలు తాగుబోతులు అంటూ ధ్వజమెత్తారు. బండి సంజయ్ అరెస్టును ఆయన ఖండించారు. ఇన్నాళ్లు ఇంట్లో పడుకున్నా కేసీఆర్‌కు ఇప్పుడు జీవో 317 గుర్తుకు వచ్చిందా అంటూ మండిపడ్డారు.
Read Also: పాత పాల్వంచలోని రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో కొత్త కోణం
ఉద్యోగులతో సంప్రదింపులు ఎందుకు జరపలేదో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. భార్య…పిల్లల దగ్గరకు కూడా పోనివ్వకుండా హౌస్ అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. గులాబీ నాయకులు చేసే కార్యక్రమాలకు పోలీసుల లాఠీలకు కనిపించడం లేదా అంటూ నిలదీశారు. బీజేపీ అంటే సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు, ముగ్గురు అధికారులు మినహా… పోలీసులంతా సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారని అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
