Chikoti Casino Case: తెలంగాణలో ‘చీకోటి’ క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈడీ విచారణ రోజుకో మలుపుతో దూకుడు పెంచుతుండటంతో రాజకీయ వేడిని పెంచుతోంది. ఇక.. విదేశాల్లో క్యాసినో అక్రమ నిర్వహణ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో నోటీసులు అందుకున్న నేతల్లో గుబులు మొదలైంది. ఈడీ విచారిస్తున్న సమయంలో బీపీ డౌన్ కావడంతో అధికారులు ఆయనను ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తులో భాగంగా డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి, తలసాని పీఏ హరీష్ మరికొందరు వ్యాపారులను సైతం ఈడీ విచారించనుంది. ఇప్పటికే విచారణకు హాజరైన ఎమ్మెల్సీ ఎల్ రమణ. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. తాజాగా మంత్రి తలసాని సోదరులను విచారించింది ఈడీ.ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హవాలా నగదు చెల్లింపులపై ఈడీ ఆరా తీస్తుంది.
read also: Annatto Seeds : ఈ గింజలు తింటే యవ్వనం మీ సొంతం
ఇక తాజాగా..ఈడీ ముందు హాజరైన ఎల్.రమణకు అస్వస్థతకు గురయ్యారు. ఈడీ విచారిస్తున్న సమయంలో బీపీ డౌన్ కావడంతో.. ఆయనకు ఆసుపత్రికి తరలించారు. ఎల్.రమణ అనారోగ్యంతో వున్నట్లు తెలుస్తోంది. ఆయనకు బీపీ డౌన్ కావడంతో కొందికి పడిపోవడంతో స్పందించిన అధికారులు ఆయనతో పాటు ఎల్.రమణ గన్ మెన్ , ఈడీ కి సంబంధించిన ఒక అధికారిని ఆయనతో పాటు ఆసుపత్రికి తరలించారు. ఈడీ విచారణ తరువాత ఆయన బయటకు వచ్చి పూర్తీ వివరాలు వెల్లడిస్తా అంటూ మీడియాకు తెలిపి లోనికి వెళ్లిన ఎల్.రమణ ఇలా అస్వస్థతకు గురికావడంతో సంచళనంగా మారింది.
Fraud: పంది పిల్లల వ్యాపారంలో పెట్టుబడి పెట్టండంటూ.. వందల కోట్లకు కుచ్చుటోపీ
క్యాసినోలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పంటర్లు రూ.కోట్లలో జూదం ఆడినట్లు ఈడీ అనుమానిస్తోంది. వీరిలో కీలక ప్రజాప్రతినిధులతోపాటు సంపన్న వ్యాపారులున్నట్లు ప్రాథమికంగా ఆధారాలు సేకరించింది. ఆ లావాదేవీల గుట్టుతేల్చే పనిలో భాగంగానే ఈడీ బృందాలు ప్రవీణ్, మాధవరెడ్డిల బ్యాంకు ఖాతాలతోపాటు పంటర్లను తరలించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానాల వ్యవహారం గురించి ఆరా తీశాయి. ఆడంబరమైన జీవితం గడుపుతూ ఆ దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేస్తూ వచ్చిన ప్రవీణ్‌కు ఇప్పుడా దృశ్యాలే సమస్యలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది. వాటికి ఖర్చు చేసేందుకు వినియోగించిన సొమ్మును ఎలా సంపాదించారని ఈడీ వర్గాలు ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
Cold Wave: రగ్గులు కప్పుకున్న నరాలుతెగే చలి.. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
