NTV Telugu Site icon

Konda Visweswar Reddy: ఇంటి కరెంట్ కు డెవలప్ మెంట్ ఛార్జ్ లు: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Konda

Konda

Konda Visweswar Reddy: రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంటి కరెంట్‌పై డెవలప్‌మెంట్‌ ఛార్జీలు వేసి ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపుతోందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకులు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని డిస్కంలు వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయన్నారు. డిస్కంల ఆస్తుల కన్నా.. అప్పులే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

Read also: Adipurush: ఆదిపురుష్ ‘అయోధ్య’ సెట్ చూశారా ..?

మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో డిస్కంలు రూ. 45వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయన్నారు. జాతీయ ర్యాంకింగ్‌లో సీ-(మైనస్‌) ఉందని విమర్శించారు. రాష్ట్రంలో డిస్కంల ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి తాను ఉండటానికి ఇంద్రభవనం లాగా నిర్మించుకున్న ప్రగతి భవన్‌కు విద్యుత్‌ బిల్లు ఎంత వస్తుందని.. దానిని చెల్లిస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లో కుక్కల కోసం ఏర్పాటు చేసిన రూమ్‌కు బిల్లు ఎంత వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలోని డిస్కంలను ముంచడమే కాకుండా .. పక్క రాష్ట్రాల(ఛత్తీస్‌గడ్‌) డిస్కంలను కూడా ముంచారని విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. వాడకున్నప్పటికీ గ్రిడ్‌కు ఏడాదికి రూ. 400 వందల కోట్లు కడుతున్నారని విమర్శించారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ ఇస్తున్న అని చెబుతూ.. ఇంటి కరెంట్‌కు డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, సర్‌ ఛార్జీల పేరుతో కోట్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. హిస్టరీ స్టార్ట్ విత్‌ మీ అనే విధంగా సీఎం కేసీఆర్‌ వ్యవహారిస్తున్నారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు.