Mallu Bhatti Vikramarka: హూవర్ డ్యామ్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
- నెవాడా-అరిజోనా రాష్ట్రాల సరిహద్దులోని హూవర్ డ్యామ్‌ను సందర్శించిన భట్టి విక్రమార్క ..
- ఫెడరల్ ప్రభుత్వ అధికారుల బృందం ఆధ్వర్యంలో డ్యామ్ మొత్తం పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: ఇవాళ నెవాడా-అరిజోనా రాష్ట్రాల సరిహద్దులోని హూవర్ డ్యామ్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. అక్కడ ఫెడరల్ ప్రభుత్వ అధికారుల బృందం ఆధ్వర్యంలో డ్యామ్ మొత్తం పర్యటించారు. విద్యుత్ ఉత్పత్తి యంత్రాంగాన్ని, మొత్తం నిర్మాణ వ్యవస్థను, కాలక్రమంలో నీటి అందుబాటుతో పాటు విద్యుత్ ఉత్పత్తి చరిత్రను ఆయన అధ్యయనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జల విద్యుత్ ప్రాజెక్టులతో హూవర్ డ్యామ్‌ను పోల్చి చూశారు. అలాగే, డ్యామ్ నిర్మాణంలో కార్మికుల భద్రతకు చేపట్టిన వివిధ భద్రతా చర్యలను, 1931 నుండి 1935 వరకు జరిగిన డ్యామ్ నిర్మాణ చరిత్రను డిప్యూటీ సీఎం అధికారుల బృందం పరిశీలించారు. ఇక రేపు సెప్టెంబర్ 27న, భట్టి బృందం అమెరికాలో అతిపెద్ద సింగిల్ సోలార్ మరియు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ అయిన ఎడ్వర్డ్స్, సాన్‌బార్న్ సోలార్ ఫెసిలిటీని సందర్శిస్తుంది. ఇక సెప్టెంబర్ 28న ఇన్వెస్టర్లు, సాంకేతిక నిపుణులతో సమావేశం కానుంది. మరుసటి రోజు (సెప్టెంబర్ 29) టోక్యో బయలుదేరుతారు.
తెలంగాణ ఏర్పడి పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పాలనలో తనదైన ముద్ర వేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల నుంచి పాలనలో భాగంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు.. ఇందులో భాగంగా భారీ కంపెనీలు, విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెట్టుబడులే లక్ష్యంగా భట్టి విక్రమార్క విదేశీ పర్యటన చేపట్టారు. నిన్న అమెరికాలోని లాస్ వేగాస్ లో ప్రారంభమైన అంతర్జాతీయ మైనెక్స్-2024 ప్రదర్శనలో పాల్గొని పలు అమెరికన్ కంపెనీల ప్రతినిథులతో సమావేశమైన విషయం తెలిసిందే.
Harsha Sai : పరారిలో యూట్యూబర్ హర్ష సాయి.. గాలింపు చర్యలు ముమ్మరం
Also Read
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!