Harsha Sai : పరారిలో యూట్యూబర్ హర్ష సాయి.. గాలింపు చర్యలు ముమ్మరం
- సినిమా పేరుతో యువతిని మోసం చేసిన హర్ష
- కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అత్యాచారం
- పరారీలో యూట్యూబర్ హర్ష.. పోలీసుల గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ పేరుతో మోసం చేసి శారీరకంగా వాడుకుని, సినిమా పేరుతో తన వద్ద రెండు కోట్ల తీసుకున్నాడని, పెళ్లి కోవాలన్నందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఓ యువతి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక ఆరోపణల కేసు పెట్టిన సంగతి ఒక్క సరిగా సంచలం రేపింది. సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ డిస్కషన్ కోసం విల్లాకు పిలిచి కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి స్పృహలో లేనప్పుడు లైంగీకదాడికి పాల్పడ్డాడని, ఆ వీడియో రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు వాపోయింది.
Also Read : Devara : జూనియర్ ఎన్టీయార్ ‘దేవర ఓటీటీ’ రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read
ఈ నేపథ్యంలో మహిళ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసారు. పోలీసులు హర్ష సాయిని విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేసారు. కానీ యూట్యూబర్ హర్ష సాయి పరారీలో ఉన్నాడని తెలియడంతో పోలీసులు నాలుగు టీం లతో గాలింపు గాలిస్తున్నారు. హర్ష సాయిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేసారు. ఇప్పటికే హర్షపై సెక్షన్ 376,,354, 328 కింద కేసులు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు. బాధితురాలకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు, హర్ష సాయి కి సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. కానీ హర్ష అమాయకుడని డబ్బుల కోసమే హర్ష సాయిపై ఆ యువతి అక్రమ కేసులు పెట్టిందని హర్ష తరపు న్యాయవాది చిరంజీవి అన్నారు. న్యాయపరంగా పోరాటం చేస్తామని, సినిమా చేస్తున్న సందర్భంలో కొన్నాళ్ళు వీళ్ళు కలిసి ఉన్నారు తప్ప అత్యాచారం ఆరోపణలు సరికాదని, ఏడాది నుంచి ఫిర్యాదు చేసిన యువతినీ హర్ష సాయి కలవలేదని అన్నారు హర్ష న్యాయవాది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!