Site icon NTV Telugu

Attack on Student: నల్గొండలో దారుణం.. యువతిపై ప్రమోన్మాది కత్తితో దాడి

Attack On Student

Attack On Student

Degree college student navya attacked with a knife by a student in nalgonda: డిగ్రీ విద్యార్ధినిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని పానగల్‌ ప్రాంతానికి చెందిన విద్యార్థిని స్థానిక ఎన్‌జీ కళాశాలలో ఇటీవలే బీబీఏ డిగ్రీ పూర్తి చేశారు. ఇదే కళాశాలలో నల్గొండ కే చెందిన మీసాల రోహిత్‌ డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నారు. ఇతడితో విద్యార్థికి పరిచయం ఏర్పడటంతో ఇదే అదునుగా గత కొంత కాలం నుంచి తనను ప్రేమించమని వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని యువతి పలుమార్లు తిరస్కరించడంతో.. ఆమెపై కోపం పెంచుకున్న రోహిత్‌ యువతిపై దాడి చేసేందుకు ప్లాన్‌ వేసాడు. తన స్నేహితులరాలి ద్వారా విద్యార్థినిని మంగళవారం పట్టణంలోని ఒక పార్కుకు రప్పించాడు.

read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

అప్పటికే తనపై దాడి చేసేందుకు రోహిత్‌ అక్కడే వున్నాడు. అయితే రోహిత్‌ ను చూసిన బాధితురాలు కంగారు పడింది. బాధితురాలు వెనక్కు వెళ్దామని ప్రయత్నించగా.. రోహిత్‌ తనతో మాట్లాడాలని బలవంతం చేయడంతో.. పక్కకు వెళ్లింది. ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలోనే వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రోహిత్‌ తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో విద్యార్థినిపై పదిమార్లు పొడిచి మొఖంపై దాడిచేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని కేకలు వేయడంతో.. అక్కడే ఉన్న తాయి, మరో స్నేహితుడు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థతి బాగానే వుందని వైద్యులు తెలిపారు.

అయితే గత కొంత కాలంగా రోహిత్‌ తన కూతురు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, తను వద్దని ఎంత నిరాకరించిన వినకుండా ఇలా తన కూతురుపై దాడి చేశాడని బాధితురాలి తల్లి దండ్రులు వాపోయారు. తన కూతురిపై ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిపై కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితున్ని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. గతంలో నిందితుడితో బాధితురాలు సన్నిహితంగా ఉన్న ఫోటోలు సైతం బయటకు రావడంతో ఇద్దరి మధ్య ఏ విషయంపై భేదాభిప్రాయాలు వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిపై తన స్నేహితుడైన సాయికి ముందే తెలుసా అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
Srilanka Crisis: శ్రీలంకకు కరెంట్ షాక్.. 264 శాతం పెరిగిన కరెంట్ ఛార్జీలు

Exit mobile version