Site icon NTV Telugu

2 Thousand Notes: ఏం చెప్పాల్రా బై.. పంచబోతే కష్టం.. పంచకుంటే నష్టం..

Untitled 12

Untitled 12

Election scenario: సమ్మర్ సీజన్లో మామిడిపండ్ల అమ్మకం.. ఎన్నికల సీజన్లో మందు బాటిళ్ల పంపకం తప్పనిసరి. కరెన్సీ నోటు చూపకుంటే.. మందు బుడ్డీ ఇవ్వకుంటే గెలవడం కష్టం అంటున్నారు నేతల అనుచరులు. గత ఎన్నికల సమయంలో రెండువేల నోట్లు ఉన్నాయి. కనుక నగదును తరలించడం.. పంచడం సులువైంది. అయితే ప్రస్తుతం రెండు వేల నోట్లు రద్దు చేశారు. దీనితో 500 వందల నోట్ల పైన ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. రేడు వేల నోటు తో పోలిస్తే 500 వందల నోట్ల పంపకం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఇంట్లో రెండు ఓట్లు ఉన్నాయి అనుకోండి కేవలం ఒక రెండు వేల నోటు ఇస్తే సరిపోతుంది. కానీ అదే 500 నోట్లు అయితే 4 ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే నగదుని రవాణా చేసేందుకు కూడా రెండు వేల నోట్లు అయితే సులువుగా ఉంటాయి. ఎందుకంటే ఓ లక్ష రూపాయలు అయిన రెండు వేల కట్ట సన్నగా ఉంటుంది.

Read also:Anasuya Bharadwaj: మత్తు కళ్ళు అందాలతో మతి పోగొడుతున్న అనసూయ…

కనుక 10 లక్షలైనా ఓ చిన్న బ్యాగ్ లో పెట్టుకుని సులువుగా రవాణా చెయ్యొచ్చు. కానీ 500 రూపాయలు అలాకాదు. పైగా ఎన్నికల సీజన్ కనుక పోలీసులు, కేంద్ర బృందాల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగదు, మందు పంచడానికి నేతలు అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్‌ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి అనుచరుడు మాట్లాడుతూ.. ఎన్నికల సమయం కావడం చేత అధికారుల తనికీలు ముమ్మరం అయ్యాయని.. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో నగదును రవాణా చేయడం.. పంచడం కష్టంగా మారిందని.. రెండు వేల నోట్లు రద్దు కావడంతో నగదును పంచడం, రవాణా చేయడం కష్టంగా మారిందని.. అలా అని నగదు, మందు పంచకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. ఓటమి తప్పదని అందుకే ఎంతకష్టమైన పంచుతున్నామని పేర్కొన్నారు.

Exit mobile version