Site icon NTV Telugu

CM KCR: డిసెంబరు 1 నుంచి ప్రజల్లోకి ముఖ్యమంత్రి..

Kcr

Kcr

CM KCR: రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం డిసెంబర్‌తో నాలుగేళ్లు పూర్తి చేసుకోనుంది. ఆ తర్వాత ఎన్నికల సంవత్సరం! ఇప్పటికే రాష్ట్రంలో తారాస్థాయికి చేరిన రాజకీయ వేడి ఈ ఏడాదిలో తారాస్థాయికి చేరనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన విధంగా జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు… భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ… ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని, ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టాలని భావిస్తున్నారు.

Read also: Shraddha Walker Case: శ్రద్ధవాకర్ కేసులో మరో ట్విస్ట్.. హత్య అనంతరం అఫ్తాబ్ డాక్టర్‎తో డేటింగ్

డిసెంబర్ 1 నుంచి ఇందుకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా వివిధ జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ సముదాయాలను ప్రారంభించనున్నారు. డిసెంబర్ 1న మహబూబాబాద్, 4న మహబూబ్ నగర్, 7 లేదా 8న జగిత్యాల, ఆ తర్వాత అదే నెలలో మంచిర్యాల, ఖమ్మం, ఈ సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలన్నారు. అలాగే రాష్ట్రాన్ని దాదాపు రూ.40 వేల కోట్ల రుణం తీసుకోకుండా కేంద్రం అడ్డుకుందని శాసనసభ వేదికపై ప్రచారం చేయాలని నిర్ణయించిన కేసీఆర్. అలాగే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు అనుసరిస్తున్న పద్ధతిని మరోసారి ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. జిల్లాల పర్యటనలో బీజేపీపై మరింత దూకుడు పెంచాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం.
Cyber Crime: నరేశ్ చేతిలో దారుణంగా మోసపోయిన జీవిత రాజశేఖర్

Exit mobile version