NTV Telugu Site icon

Medchal:కుళ్లిపోయిన మహిళ మృతదేహం, కొడుకు పై అనుమానం!

Nalgonda

Nalgonda

నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపూరి కాలనీలోని దారుణం జరిగింది. మైత్రి నివాస్ అపార్టుమెంట్‌లోని 202 నెంబర్ ఫ్లాట్‌లో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. తల్లి మృతదేహంతో పాటు మూడు రోజులుగా అపార్ట్‌మెంట్‌లోనే కుమారుడు ఉన్నాడు. సాయి కృష్ణ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదని తరచూ తల్లి, కొడుకులు గొడవ పడేవారని స్థానికులు చెబుతున్నారు.

కొడుకు మానసిక స్థిమితం బాగా లేకపోవడంతో కొడుకే తల్లిని హత్య చేసి ఉండొచ్చని తెలిపారు. ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తుండడంతో అపార్ట్‌మెంట్ వాసులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన మహిళ విజయ(50) అని అపార్ట్‌మెంట్ వాసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో కొడుకే తల్లిని హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇలాంటి ఘటనే.. సూర్యాపేట జిల్లాలోని మోతెలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి జనార్దన్‌రెడ్డి అనే వృద్ధుడిని దుండగులు కత్తులతోపొడిచి హత్య చేశారు. శనివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థాలానికి చేరుకన్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. భూవివాదమే హత్యకు కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే .. గురువారం కోయిలసాగర్ డాంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్య మయింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో గుర్తు తెలియని మహిళ(55) మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనస్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి మృతదేహాని పోసమార్టం నిమ్మితం జిల్లా ఆసుపత్రికి తరలించిన దేవరకద్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా.. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం జైత్రామ్ తండాలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గ్రామ శివారులో కంచ లో పడి ఉంది. వారం రోజుల క్రితం మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని స్వాధీనపరచుకొని విచారిస్తున్నట్లు వాడపల్లి పోలీసులు తెలిపారు.

ఒక ప‌క్క హ‌త్య‌లు, మ‌రో ప‌క్క మృత‌దేహాలు పోలీసుల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వ‌రుస హ‌త్య‌లు పోలీసుల‌కు స‌వాల్ విసురుతుంటే , అనుమానంతో కొంద‌రు కుటుంబ స‌భ్యుల‌నే క‌డ‌తేర్చడం ర‌క్ష‌క భ‌టుల‌కు త‌ల‌నొప్పిగా మారాయి. ఈ ఘ‌ట‌ల‌పై పోలీసులు త‌లలు ప‌ట్టుకుంటున్నారు. ఏ నిమిషంలో.. ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో అర్థం కాని అయోమ‌యంలో ప‌డ్డారు. ఏదీఏమైనా.. వ‌రుస హ‌త్య‌ల‌తో పోలీసుల‌కు స‌వాల్ విసురుతున్న నేర‌గాళ్ల‌ను ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు మ‌న పోలీసు బాసులు.