NTV Telugu Site icon

Hyderabad Murder: హైదరాబాద్‌లో మరో హత్య.. కాచిగూడ రైల్వే ఫ్లాట్‌ ఫామ్‌ పై మృతదేహం..

Hyderabad Murder

Hyderabad Murder

Hyderabad Murder: హైదరాబాద్‌లో మరో హత్య సంచలనంగా మారింది. కాచిగూడ రైల్వే ప్లాట్‌ఫారమ్‌లో మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాట్‌ ఫామ్‌ పై వున్న సిబ్బంది మృత దేహాన్ని చూసి షాక్‌ తిన్నారు. వెంటనే రైల్వే పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో హుటా హుటిన రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం కిజార్‌ అనే వ్యక్తిగా గుర్తించారు. పాత నగరానికి చెందిన చుమ్మా చౌష్ మనవడుగా తెలిపారు పోలీసులు. కిజార్‌ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. అయితే కిజార్‌ కుటుంబం ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో చంపి రైల్వే ట్రాక్‌ పై పడేసి వెళ్లారని వాపోయారు. కిజార్‌ తండ్రి సోహెల్‌ మాట్లాడుతూ.. నా కొడుకు కిజార్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని తెలిపాడు. ఇది ఆక్సిడెంట్‌ కాదని, ఇది పక్కా మర్డర్‌ అని తెలిపారు. ఉదయం 4.30 గంటలకు కిజార్‌ లేచి తన తల్లికి ఇప్పుడే వస్తా అని బయటకు వెళ్లాడని తెలిపారు. గంటకే పోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో భయాందోళన చెందామని తెలిపారు.

Read also: CM Chandrababu: రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. కూల్చిన ప్రజావేదిక నుంచే స్టార్ట్..!

సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. నా కొడుకు కిజార్‌ ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పడు నేను ఆఫీస్‌ లో వున్నానని తెలిపాడు. నాకు నా చిన్న కొడుకు కిజార్‌ గురించి సమాచారం ఇచ్చాడని అన్నారు. స్నేహితులని, బంధువును అడగాలని తెలుపగా.. అడిగినా సరైన సమాధానం లేదని చిన్న కొడుకు తెలిపాడు. కొందరు తెలిసిన వాళ్లు మాకు కాల్ చేసి కాచిగూడ వెళ్లాలని తెలుపడంతో మేమందరం అక్కడకు వెళ్లామని అన్నాడు. నా కొడుకు వస్తాడనే మేము వెతుకుతూనే వున్నామని పోలీసులకు సమాచారం ఇవ్వలేదని తండ్రి అన్నారు. తన కొడుకు మృతదేహం మహమ్మద్‌ నగర్‌ వద్ద మహమ్మదీయ మసీదు వద్ద నా కొడుకును మర్డర్‌ చేసి వుంటారని నా అనుమానం అన్నారు. ఇది ఆత్మహత్యగా పోలీసులు చిత్రీకరిస్తూ కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కొడుకును ఎవరో చంపేసి కాచీగూడ రైల్వే ట్రాక్‌ పై పడేసి వుంటారని తెలిపారు. ఎందుకంటే తన తలపై, మోకాళ్లపై బలమైన గాయాలు ఉన్నాయని అన్నారు. తన తలను కూడా నరికేసి రైల్వే ట్రాక్‌ పై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తు్న్నట్లు తెలిపారు. దీనిపై పోలీసులు సరైన విచారణ జరపాలని వేడుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకుంటూ మోకాళ్ల వద్ద బలమైన గాయాలు వున్నాయని, మొఖంపై కంటి మీద కూడ గొడ్డలితో నరికి నట్లు వుందని అనుమానం వ్యక్తం చేశాడు. సరైన విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.
US- Taiwan: తైవాన్‌కు అమెరికా నుంచి వెయ్యి సాయుధ డ్రోన్లు.. చైనాకు చెక్ పెట్టేందుకేనా?