DCP Rohini Priyadarshini: తల్లీ కూతుళ్ల ధైర్యసాహసాలకు జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడిన దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్న వారి పోరాట పటిమ అభినందనీయం. హైదరాబాద్ బేగంపేటలోని పైగా కాలనీలో ఇద్దరు దొంగలను సమర్థవంతంగా ఎదుర్కొని తరిమికొట్టిన తల్లీకూతుళ్లను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా డీసీపీ రోహిణి మాట్లాడుతూ దొంగలను పట్టుకునేందుకు అమిత్ మహోత్, ఆమె మైనర్ కూతురు చేసిన కృషి అభినందనీయమన్నారు. కాలనీలో నిన్న మధ్యాహ్నం దోపిడీ యత్నం జరిగింది.
Read also: Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్.. ట్రెండింగ్లోకి వచ్చిన సత్యపాల్ మాలిక్
నిందితులు హత్య చేసేందుకు ప్రయత్నించారు. 2022లో దీపావళి సమయంలో తమ ఇంటికి పనికి వచ్చారు. నాలుగు రోజులు పనిచేశారు. ఇద్దరు నిందితులు దోపిడీకి ప్లాన్‌తో వచ్చారు. రెండు రోజుల క్రితమే రేకి చేశారు. కొరియర్ వచ్చిందని చెప్పి ఇంట్లోకి వచ్చారు. కంట్రీ మేడ్ వెపన్, కత్తితో బెదిరించారు. నిందితుడిని పట్టుకునేందుకు తల్లీ కూతుళ్లు సాహసం చేశారు. నా పదకొండేళ్ల సర్వీసులో ఇంత ధైర్యం చూపిన మహిళలను చూడలేదు. ఇక్కడ ఒక నిందితుడు పట్టుబడ్డాడు. మరో నిందితుడిని కాజీపేటలో జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. ఆయుధాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. గతంలో ఏమైనా కేసులు ఉంటే దర్యాప్తు చేస్తున్నామన్నారు. మహిళలు కూడా ఆత్మరక్షణ నేర్చుకోవాలని డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు.
Read also: K.Kavitha: బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లండి.. సుప్రీమ్ కోర్టులో కవితకు ఎదురు దెబ్బ..!
కాగా.. గురువారం మధ్యాహ్నం బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. రసూల్‌పుర జైన్ కాలనీ లోని ఓ ఇంట్లో నవరతన్ జైన్ కుటుంబం నివాసం ఉంటోంది. గురువారం మధ్యాహ్నం కాలనీ లోని వారు ఉన్న ఇంటికి కొరియర్ డెలివరీ బాయ్ వచ్చారు. కాకపోతే ఆ సమయంలో నవరతన్ జైన్ ఇంట్లో లేకపోవడంతో.. భార్య అమిత మేహోత్, కుమార్తె, పనిమనుషులు మాత్రమే ఉన్నారు. ఇక మొదటగా ఆ సమయంలో మధ్యాహ్నం 2 :15 గంటల సమయంలో ఇద్దరు యువకులు నేరుగా కొరియర్ అంటూ ప్రధాన గేటు నుంచి లోపలకు వచ్చారు. అయితే వారిని గుమ్మం బయటే ఉండాలని అమిత సూచిస్తుండగానే వచ్చిన ఇద్దరిలో ఒకరు నేరుగా ఇంట్లోకి చొరబడిన వారిని తల్లికూతుర్లు ఎదుర్కొన్న సాహస ఘటన తెలిసిందే..
MS Dhoni: ఐపీఎల్లో ధోని ఆడటంపై అనుమానాలు.. సీఎస్కే ఏం చెప్పిందంటే..?