Praja Sangrama Yatra: నిర్మల్ జిల్లా రత్నా పూర్ కాండ్లి నుంచి 8వ రోజు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అయింది. రత్నపూర్ కండ్లీ, కనకపూర్, నర్సాపూర్, వడ్డేపల్లి, బోరేగావ్ మీదుగా మామడ వరకు ఈ యాత్ర కొనసాగనున్నారు. ఈరోజు మొత్తం 14.3 కిలోమీటర్ల మేర “ప్రజా సంగ్రామ యాత్ర” కొనసాగనుంది. ఇవాళ మామడ గ్రామ శివార్లలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు. నిర్మల్ జిల్లాలో నిన్న రాత్రి శిబిరం వద్ద బండి సంజయ్ ని బాసరకు చెందిన “వేద భారతి పీఠ వేద విద్యాలయం” వేద విద్యార్థులు కలిశారు. బండి సంజయ్ కి వేద విద్యార్థులు వేద ఆశీర్వచనం చేశారు. బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర” దిగ్విజయంగా జరగాలని ఆశీర్వదించారు. హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్నామని బండి సంజయ్ వేద విద్యార్థులతో చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక, వేద పాఠశాలల సంఖ్యను మరింత పెంచే విధంగా కృషి చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
Read also: Kurnool Live: కర్నూలులో రాయలసీమ గర్జన లైవ్ అప్‌డేట్స్
ప్రజా సంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే నాలుగు విడతలుగా పాదయాత్రలు చేసిన బండి సంజయ్.. ప్రస్తుతం ఐదవ విడత పాదయాత్ర చేస్తున్నారు. అయితే.. ముందుస్తు ఎన్నికలు వస్తే బస్ యాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అందుకు అనుగుణంగా తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీని పూర్తిగా సన్నద్దంగా ఉంచేలా పార్టీ క్యాడర్ ను సంసిద్దం చేస్తోంది. అదే సమయంలో ముందుస్తు ఎన్నికలొస్తే ప్రజా సంగ్రామ యాత్ర పరిస్థితి ఏమిటనే అంశంపైనా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే… పాదయాత్రకు సమయం సరిపోయే అవకాశం లేనందున… పాదయాత్రకు బదులుగా బస్ యాత్ర చేపట్టే అంశంపై సీరియస్ గా కసరత్తు మొదలుపెట్టారు.
Keerthy Suresh: ‘మహానటి’ కంబ్యాక్… ఒకేసారి రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్