Keerthy Suresh: ‘మహానటి’ కంబ్యాక్… ఒకేసారి రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కీర్తి సురేష్ అనే పేరు వినగానే అందరికీ ‘మహానటి’ సినిమా గుర్తొస్తుంది. ‘మహానటి సావిత్రి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. అప్పటివరకూ మాములుగా ఉన్న కీర్తి సురేష్ కెరీర్ ని టర్న్ చేసిన ‘మహానటి’ సినిమా కీర్తిపై ప్రేక్షకుల్లో అంచనాలని పెంచింది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ నుంచి ఆడియన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ అంచనాలని అందుకోవడంలో కీర్తి సురేష్ ఫెయిల్ అయ్యింది, బ్యాక్ టు బ్యాక్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది కానీ ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో ‘మహానటి’తో కీర్తి సురేష్ కెరీర్ అయిపోయినట్లే, ఇక ఆమె హిట్ ట్రాక్ ఎక్కడం కష్టమని అందరూ అనుకున్నారు. ఇదే టైంలో లావు తగ్గి, కీర్తి సురేష్ ఫేస్ లో కళ పోగొట్టుకుంది. ‘సావిత్రి’గా నటించి మెప్పించిన అమ్మాయి ఇలా అయిపోయిందేంటి అని జాలి పడిన వాళ్లు కూడా ఉన్నారు.
బ్యాక్ టు బ్యాక్ పది ఫ్లాప్స్ ఇచ్చింది అంటే కీర్తి సురేష్ కెరీర్ ఎంత డౌన్ అయ్యి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో లాభం లేదనే విషయం తెలుసుకున్న కీర్తి సురేష్, హీరోల పక్కన నటించడం మొదలుపెట్టింది. ఈ కోవలోనే వచ్చిన ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేశ్ పక్కన నటించి లీర్తి సురేష్ మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఈ మూవీలో కీర్తి తన గ్లామర్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడమే కాకుండా ‘మ.. మ.. మహేషా” సాంగ్ లో డాన్స్ తో కూడా ఆకట్టుకుంది. సర్కారు వారి పాట సినిమా ఇచ్చిన జోష్ లో కీర్తి సురేష్ హిట్ ట్రాక్ ఎక్కింది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’, చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోలా శంకర్'(చిరుకి చెల్లిగా), హోంబలే ప్రొడక్షన్ హౌజ్ నిర్మిస్తున్న ‘రఘు తాత’ సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘దసరా’, ‘రఘు తాత’ సినిమాలు పాన్ ప్రాజెక్ట్స్ గా తెరకెక్కుతున్నాయి. రెండు సినిమాల్లో కీర్తి సురేష్ కొత్తగానే కనిపించనుంది కాబట్టి ఆమె గోల్డెన్ పీరియడ్ మళ్లీ స్టార్ట్ అయినట్లే. ఈ సినిమాలు సాలిడ్ హిట్స్ గా నిలిస్తే కీర్తి సురేష్ పాన్ ఇండియా హీరోయిన్ అవ్వడం గ్యారెంటి.
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
తాజావార్తలు
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!