Site icon NTV Telugu

DAV Public School Reopened: నేటి నుండి DAV పబ్లిక్ స్కూల్ రిఓపెన్.. బాదిత చిన్నారులు ఆందోళన

Dav

Dav

DAV Public School Reopened:  నేటి నుండి DAV పబ్లిక్ స్కూల్ రిఓపెన్ చేయనున్నారు యాజమాన్యం. దాదాపు 20 రోజుల తరువాత డీఏవీ స్కూల్‌ ను రిఓపెన్ చేశారు అధికారులు. తమకు న్యాయం జరగకుండానే స్కూల్ ని ఎలా ఓపెన్ చేశారని స్కూల్ ఎదుట బాధిత చిన్నారి తల్లిదండ్రులు బయటాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం స్కూల్ యాజమాన్యం తమ వద్దకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారికి జస్టిస్ జరగకుండనే స్కూల్ ఎలా ఓపెన్ చేశారని ప్రశ్నించారు. స్కూల్ క్లోజ్ చేయమని చెప్పలేదని, స్కూల్ క్లోజ్ చేసి ఎందుకు రిఓపెన్ చేశారని మండిపడ్డారు. బాధితులం మేము కానీ.. మమ్మల్ని ఎవరు అడగకుండానే చిన్నారికి జస్టిస్ అవ్వకుండానే స్కూల్ ఎలా ఓపెన్ చేస్తారని బాధిత చిన్నారి తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రభుత్వం తమ భాధను పట్టిచుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. రిఓపెన్ పై మమల్ని కనీసం అడగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read also: Prabhas: మిల్కీబ్యూటీని ఆట ఆడిస్తున్న ప్రభాస్.. వైరలవుతున్న వీడియో

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ అనుమతిని నవంబర్‌ 1న నుంచి పునరుద్ధరిస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ. సంవత్సరానికి తాత్కాలిక అనుమతిని ఇచ్చింది. తాము సూచించిన నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి ఘటన చోటు చేసుకోవడంతో ఆస్కూల్‌ గుర్తింపును రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యలో స్కూల్‌ అనుమతులు రద్దు చేస్తే, తమ పిల్లల పరిస్థితి ఏంటని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను పునర్‌ ప్రారంభించింది. తల్లిదండ్రులు వేడుకున్నారు.. దీంతో ఈ విద్యా సంవత్సరానికి పాఠశాలలను కొనసాగించవచ్చని అనుమతి ఇచ్చింది విద్యాశాఖ.

Read also: Twitter: ట్విట్టర్ ఉద్యోగులకు మాస్క్ షాక్.. సగంమంది అవుట్?

అక్టోబర్‌ 19న ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు డ్రైవర్ రజనీకుమార్. ఈ ఘటన తెలిసిన వెంటనే తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. డ్రైవర్‌ను కొట్టి పోలీసులకు అప్పగించారు కుటుంబ సభ్యులు. డీఏవీ స్కూల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. లైంగిక దాడి కేసులో డ్రైవర్ రజిని కుమార్ తో పాటు ప్రిన్సిపాల్ మాధవిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మాధవిపై కేసు నమోదయింది. ఇద్దరిని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు పోలీసులు. గత పన్నెండేళ్ళుగా ఇదే స్కూళ్ళో క్లీనర్ గా, డ్రైవర్ గా పని చేస్తున్నాడు రజినీకుమార్. అత్యాచార ఘటనపై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం.. స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. అయితే, పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో వుంచుకుని స్కూల్ రీ ఓపెనింగ్‌కు అనుమతించాలంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.. దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. దీంతో.. చివరకు డీఏవీ స్కూల్‌కు మళ్లీ తాత్కాలిక అనుమతి ఇచ్చింది విద్యాశాఖ.
Rahul Gandhi Bharat Jodo Yatra: సంగారెడ్డి జిల్లాలో జోరుగా.. హుషారుగా జోడో యాత్ర (ఫోటోలు)

Exit mobile version