Site icon NTV Telugu

Dasoju Sravan Kumar : ఇంగితం లేకుండా కవిత ట్వీట్ చేశారు

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కౌంటర్‌ ఇచ్చారు. రైతులకు భరోసా ఇచ్చే మాట చెప్పారు రాహుల్ గాంధీ అని, తలకాయ ఉన్న ఎవరికైనా తప్పు అనిపించదన్నారు. కానీ కన్నుమిన్ను ఆనకుండా టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఇంగితం లేకుండా కవిత ట్వీట్ చేశారని, మీరు వేసే చిల్లర రాజకీయంలో మేము భాగస్వామ్యం కావాలా..? అని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ నిజాయితీనీ అడుగుతున్నారని, దగా..కుట్ర, మోసం కి చిరునామా టీఆర్‌ఎస్‌ అని ఆయన ధ్వజమెత్తారు.

2021లో ఒప్పందం ఎవరిని అడిగి ఇచ్చారని, పార్లమెంట్ వెల్ లో కాదు.. రైతుల కల్లాల్ల పోరాటం కావాలన్నారు. ఐకేపీ కేంద్రాలు పెట్టండి అంటే… ఢిల్లీలో మంత్రులు నాటకం ఆడుతుందని, వరి వేస్తే కేసులు పెడతమని చెప్పిన కలెక్టర్‌ని ఎమ్మెల్సీ చేసింది మీ పార్టీ అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో డ్రామాలు ఆపేయండని, బీజేపీ పై నిజంగా పోరాటం చేయాలని అనుకుంటే.. వెంటనే ఎంపీ పదవులకు రాజీనామా చేయండని ఆయన సవాల్‌ విసిరారు.\

https://ntvtelugu.com/leader-santosh-suggestions-to-bjp-leaders/
Exit mobile version