Site icon NTV Telugu

Dasoju Sravan: జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో కుట్ర జరుగుతోంది

Dasoju

Dasoju

జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన లో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు కొన‌సాగుతుంది. బాలికపై అత్యాచారం ఘటనలో ఇప్పటి వరకూ ఐదుగురుని అదుపులో తీసుకున్నారు. అయితే ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా దాసోజు శ్రవణ్ స్పందించారు.

నిందితులను అరెస్ట్ చేయడానికి బదులుగా, కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందని.. డ్రగ్, పబ్ కల్చర్ కి పరాకాష్టగా మారిన హైదరాబాద్ లో తాజాగా ఒక పబ్ నుండి టీఆర్ఆర్, ఎంఐఎం పార్టీ చెందిన పెద్దల పిల్లలు ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన అరాచక చర్యని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖడించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక అత్యాచార ఘటనలో నిందుతులు ఎంతటివారైన కఠినంగా శిక్షించాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేసారు.

Exit mobile version