NTV Telugu Site icon

TS Congress: నేడు ‘దశాబ్ది దగా’ ధర్నా.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల హౌస్ అరెస్ట్

Ts Congress

Ts Congress

TS Congress: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వ నిధులను వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వంపై ‘దశబ్ది దాగా’ పేరుతో నిరసన తెలపాలని నిర్ణయించింది. దీంతో దశాబ్ది దగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రావణాసురుడిలా కేసీఆర్ దిష్టి బొమ్మను తయారు చేసి పది తలలు అమర్చి ప్రభుత్వ వైఫల్యాలను తలపై రాసి భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం వాటిని దహనం చేస్తారు.

అక్కడి నుంచి ఆర్డీఓ, ఎమ్మార్వోలకు వినతి పత్రాలను అందజేస్తారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలి. ఆ పథకాల బాధిత ప్రజలు నిరసనలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని నాయకులందరూ కృషి చేయాలని కోరారు. ఈనేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు పోలీసులు. మాజీ ఎల్.ఓ.పి. షబ్బీర్ అలీని హైదరాబాద్ లో ఆయన నివాసంలో బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యాలు..

1. కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య
2. ఫీజ్ రీయంబర్స్ మెంట్
3. ఇంటికో ఉద్యోగం
4. నిరుద్యోగ భృతి
5. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
6. దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి
7. పోడు భూములకు పట్టాలు
8. రైతు రుణ మాఫీ
9. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు
10. 12 శాతం గిరిజన రిజర్వేషన్లు
BJP Door to Door: రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ.. కరీంనగర్‌ ప్రజలతో బండి సంజయ్