తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ వ్యవహారం తెలంగాణలో హీట్ పెంచింది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బుధవారం కౌశిక్ మాట్లాడుతూ… కాంగ్రెస్‌లో చేరిన అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర జెండా పాతుతానని సవాల్ విసిరారు. దీంతో గురువారం అరికెపూడి గాంధీ, అనుచరులు.. కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర హంగామా సృష్టించారు.
ఇది కూడా చదవండి: Tarvinder Singh Marwah: ‘‘మీకు మీ నానమ్మ గతే’’.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇక ఇదే వ్యవహారంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘కౌశిక్ పిల్ల బచ్చా. పాడి కౌశిక్ స్థాయి తెలుసుకొని మాట్లాడాలి. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటోంది. ఈ రాష్ట్రాన్ని ఎంత దొచ్చుకోవాలో అంతా బీఆర్ఎస్ దోచుకుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎఎస్ కొనుగోలు చేయలేదా..? అప్పుడు బీఆర్ఎస్ చేస్తే సంసారం.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే వ్యభిచారమా..?, పదేళ్ల పాటు తెలంగాణను దోచుకున్నారు. నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నాతో పాటు కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు అంతా సీనియర్లు. మళ్ళీ అధికారంలోకి వస్తామన్న భ్రమలో నుంచి బీఆర్ఎస్ బయటకి రావాలి. నేను కూడా హైదరాబాద్ వాడ్నే. ఒక్క పిలుపుతో టీఆర్ఎస్ లీడర్ల అందరి ఇళ్లను బ్లాక్ చేయగలం.’’ అని దానం హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. కేంద్ర బృందాన్ని కోరిన సీఎం చంద్రబాబు
‘‘కౌశిక్ రెడ్డి రెచ్చిపోయి గాంధీ ఇంటిమీద జెండా ఎగర వేస్తా అని రెచ్చ గొట్టే వాఖ్యాలు చేశాడు.. ఉ.11 గంటలకు గాంధీ ఇంటికి కౌశిక్ వస్తా అన్నాడు. గాంధీ రాకపోతే నేనే వస్తా అని గాంధీ వెళ్లాడు. గాంధీ వస్తే మంగళ హారతి ఇస్తామన్నారు. అందుకే గాంధీ.. కౌశిక్ ఇంటికి వెళ్లాడు. శత్రువైనా ఇంటికి వస్తే మర్యాద ఇవ్వాలి. కానీ ఇంటికి రమ్మని పిలిచి ఇంట్లో రౌడీలను పిలుచుకుని పూల తొట్టులతో దాడి చేయించాడు. చేసింది అంతా చేసి శుద్ద పూసలెక్క హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి.. సీపీ ఆఫీసు దగ్గర కూర్చుని కేసు పెట్టమన్నారు. కౌశిక్ రెడ్డి మా ఎమ్మెల్యే గాంధీని ఆంధ్రోడు అంటూ మాట్లాడుతున్నాడు. కౌశిక్ రెడ్డిపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలి.’’ అని దానం డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Germany: జర్మనీలో అశోక చక్రవర్తి అవశేషాలు.. పరిశీలించిన భారత విదేశాంగ మంత్రి