Damodara Raja Narasimha : ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ ఆస్పత్రిని సందర్శించి పేషెంట్లు, అటెండెంట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆస్పత్రిలో డ్రైనేజ్ సమస్య, ఎలక్ట్రిసిటీ, ఫైర్ సర్వీసులు, నర్సింగ్ విభాగంలో కొరతలు ఉన్నాయని గుర్తించామని తెలిపారు. మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు అన్నీ ఒకే ఫ్లోర్‌లో ఉండాలనే అభిప్రాయాలు కూడా వచ్చినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆస్పత్రుల సంఖ్య పెరిగినా, పరికరాలు సరిపోవడం లేదని, క్రిటికల్ కేసుల్లో స్టాఫ్ కొరత ఎక్కువగా ఉన్నందున దీనిపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వెల్లడించారు. పేషెంట్ అటెండెంట్ల కోసం ప్రత్యేకంగా అకామిడేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామని, CSR కింద శాశ్వత నిర్మాణం చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గాంధీ ఆస్పత్రిలో రెండు వేలకుపైగా బెడ్స్ ఉన్నందున వాటికి తగిన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. పాత పరికరాలను తొలగించి, కొత్త పరికరాలతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. IVF సెంటర్లలో నిబంధనలు అతిక్రమిస్తున్న కొన్ని క్లినిక్‌లపై చర్యలు ప్రారంభమయ్యాయని, కొన్నిటిని ఇప్పటికే మూసివేశామని వెల్లడించారు. అలాగే పెట్ల బురుజు, కొండాపూర్‌లో కొత్త IVF సెంటర్ల ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇప్పటికే కొన్ని చోట్ల పాజిటివ్ ఫలితాలు వచ్చాయని వివరించారు.
హాస్టల్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని, పరికరాల నిర్వహణ, స్టాఫ్ నియామకాలు వంటి అంశాలపై త్వరలోనే పూర్తి స్థాయి నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. “ప్రభుత్వం ఈ సమస్యలను సీరియస్‌గా తీసుకుంటోంది… త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి” అని ఆయన స్పష్టం చేశారు.
Rajahmundry: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డితో ములాఖాత్ కానున్న జగన్!
