Site icon NTV Telugu

Dalit Bandhu Funds: బ్యాంక్ తప్పిదంతో ఇతరుల అకౌంట్లోకి కోటి 50లక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది దళిత బంధు పథకం. అయితే లబ్దిదారులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకి రూ.10 లక్షలు జమ చేసే ఈ పథకంలో పొరపాటు జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ దళిత బంధు నిధులను రంగారెడ్డి జిల్లా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలంటూ లకిడికపూల్‌లోని రంగారెడ్డి జిల్లా ఎస్బీఐ కలెక్టరేట్ బ్రాంచ్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే.. బ్యాంక్ క్లరికల్ తప్పిదంతో ఇతరుల అకౌంట్లో కి సొమ్ము జమ కావడంతో బ్యాంక్‌ అధికారులు గందరగోళంలో పడ్డారు. ఏప్రిల్ 26న బ్యాంక్‌ అధికారులు దళిత బంధు లబ్దిదారులకు రూ.15 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే బ్యాంక్‌ క్లరికల్‌ తప్పిదం వల్ల అందులో 15 మంది వేరే వారి ఖాతాలు చేరాయి.

అదే బ్యాంక్‌లో ఖాతాదారులైన లోటస్ హాస్పిటల్‌లో పని చేస్తున్న ఉద్యోగుల ఖాతాలోకి కోటి 50లక్షల దళిత బంధు నిధులు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఈ విషయాన్ని 15 రోజుల తరువాత బ్యాంక్ అధికారులు తెలుసుకున్నారు. దీంతో.. 14మంది వద్ద డబ్బులు రికవరీ చేసిన బ్యాంక్ అధికారులు.. కృష్ణ అనే వ్యక్తి మాత్రం మొత్తం డబ్బులు వాడుకోవడంతో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో బ్యాంక్ మేనేజర్ క్రాంతి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version