Site icon NTV Telugu

Shadnagar: షాద్‌నగర్‌లో పేలిన సిలిండర్.. 11 మందికి తీవ్ర గాయాలు

Gas Cilender

Gas Cilender

Shadnagar: హైదరాబాద్ నగర శివార్లలోని పలు కంపెనీల్లో ఇటీవల పేలుడు ఘటనలు, భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో భయాందోళనకు గురవతున్నారు. రెండు రోజులకు ఒక సారి పేలుడు సంభవిస్తుండటంతో కలకలం రేపుతుంది. ఇక తాజాగా షాద్‌నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.

Read also: Boy Killed Brother: చేపల విషయంలో గొడవ.. తమ్ముడ్ని చంపిన అన్న

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం శివారులోని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి మంటలు భారీగా చెలరేగాయి. దీంతో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనకు గురయ్యాయి. లోపల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించిన ఫలితం లేకుండాపోయింది. మంటలు భారీగా చలరేగడంతో అందులో వున్న 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటా హుటిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే మంటల్లో వున్న కార్మికులను రక్షించేందుకు ప్రయత్నించినా కొందరిని మంత్రం బయటకు తీసుకువచ్చారు. వారు తీవ్రంగా గాయపడటంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అలాగే మరికొందరిని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్న వారిని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించినట్లు తెలుస్తోంది. బూర్గుల శివారులోని శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే కంపెనీలో సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Boy Killed Brother: చేపల విషయంలో గొడవ.. తమ్ముడ్ని చంపిన అన్న

Exit mobile version