Weekend Special Drive: సైబరాబాద్‌లో వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ సెగ.. 196 మందిపై కేసులు..!
- వీకెండ్ డ్రైవ్‌లో 196 మందిపై కేసులు
- 13 మందిలో అత్యంత ప్రమాదకర BAC స్థాయులు
- BNS-2023 సెక్షన్ 105 కింద కఠిన చర్యలు
- జైలు శిక్షలు, భారీ జరిమానాల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం బాబులు భారీగా చిక్కారు. వారాంతపు రోజుల్లో రోడ్లపై ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 196 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వారిలో 140 మంది ద్విచక్ర వాహనదారులు ఉండగా, 41 కార్లు, 13 ఆటోలు , ఇద్దరు భారీ వాహన చోదకులు కూడా ఉన్నారు. బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ (BAC) పరీక్షల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పట్టుబడిన వారిలో 157 మంది శరీరంలో ఆల్కహాల్ శాతం 36 నుండి 200 మిల్లీ గ్రాముల మధ్య ఉండగా, 13 మందిలో అత్యంత ప్రమాదకరమైన 301 నుండి 550 మిల్లీ గ్రాముల మోతాదు నమోదైందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-I రంజన్ రతన్ కుమార్ వెల్లడించారు.
MP Imran Masood: “పార్లమెంట్‌లో నమాజు చేస్తా.. కానీ వందేమాతరం పాడను”.. ఎంపీ ఇమ్రాన్ సంచలన ప్రకటన..
Also Read
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
మద్యం సేవించి వాహనం నడిపేవారిపై ఇక నుంచి పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరించనున్నారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, మద్యం మత్తులో వాహనం నడిపి ఎవరి ప్రాణాలకైనా ముప్పు కలిగిస్తే కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS) – 2023లోని సెక్షన్ 105 కింద కేసులు నమోదు చేయనున్నారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే గరిష్టంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధిస్తారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రాణహాని కలిగించే తీవ్రమైన నేరమని, పట్టుబడిన వారందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపరుస్తామని పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు తమ బాధ్యతను గుర్తించాలని, కేవలం మత్తు కోసం ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టవద్దని హెచ్చరించారు.
కోర్టులు కూడా డ్రంక్ డ్రైవింగ్ కేసులపై కఠినంగా స్పందిస్తున్నాయి. గత వారంలో (ఫిబ్రవరి 09 నుండి 14 వరకు) కోర్టులు సుమారు 212 కేసులను పరిష్కరించగా, అందులో ఆరుగురికి జైలు శిక్షతో పాటు సోషల్ సర్వీస్ చేయాలని తీర్పునిచ్చాయి. మిగిలిన 206 మందికి భారీ జరిమానాలు విధించాయి. పట్టుబడిన వారి వివరాలను రికార్డుల్లో భద్రపరుస్తామని, ఇది భవిష్యత్తులో వారి పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ , ఉద్యోగ ప్రయత్నాలపై కూడా ప్రభావం చూపుతుందని అధికారులు గుర్తు చేస్తున్నారు. వీకెండ్స్‌లో తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని, వాహనదారులు నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు