Site icon NTV Telugu

ఏడాదికి 100 కోట్లు దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు…

సైబర్ నేరగాళ్లు రోజు రోజు రెచ్చిపోతున్నారు. ఏడాదికి పలు రకాల ఆప్ లతో 100 కోట్ల రూపాయలు దోచేస్తున్నారు అని సైబరాబాద్ సి.పి. సజ్జనార్ తెలిపారు. ఇతర నేరాల తో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఐదోవ తరగతి కూడా చదవని నేరగాళ్లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఖాతాల నుండి డబ్బులు దోచేస్తున్నారు. Olx, క్వికర్, ఫ్లిప్ కార్ట్,99 ఏకర్స్, మ్యాజిక్ బ్రిక్స్, టీం వీవెర్, ఏని డెస్క్,ఎస్ బి ఐ, జియో, ఎయిర్టెల్ కస్టమర్ కేర్,అమెజాన్, టైమ్స్ జాబ్స్, నౌకరీ. కం. సోషల్ మీడియా వాట్స్ అప్, ఫేస్ బుక్, ట్విటర్, టెలిగ్రాం తదితర యాప్ లతో మోసాలు చేస్తున్నారు అని తెలిపారు.

అపరిచిత వ్యక్తుల వీడియో కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడ వద్దు. జార్ఖండ్ అడ్డగా చేసుకున్న కేటుగాళ్లు…. ప్రజలకు అనుగుణంగా అన్నీ భాషల్లో మాట్లాడి మొసం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల వారికి ఎక్కువ జీతం ఇస్తూ వారిని జార్ఖండ్ కు తీసుకొని వెళ్లి తెలుగులో మాట్లాడించి నేరాలకు పాల్పడుతున్నారు అని పేర్కొన్నారు.

Exit mobile version