Site icon NTV Telugu

Cyber ​​frauds: నిరుద్యోగులపై సైబర్ వల.. నమ్మించి రూ.9.79 లక్షలు దోపిడీ

Sam Alert Kamareddy

Sam Alert Kamareddy

Cyber ​​frauds: సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొత్త మాస్టర్ ప్లాన్లతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. యువత మాత్రం మోసపోతూనే వున్నారు. నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని పార్టీ టైమ్ జాబ్స్ ద్వారా సంపాదించుకోవచ్చని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. ఉన్నత విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడడానికి అత్యాశ, అవగాహన లేమి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ డబ్బులు వస్తాయన్న మూర్ఖత్వం సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది.

Read also: Dogs Attacking Deers: అనంతగిరిలో దారుణం.. జింకలను పీక్కుతింటున్న కుక్కలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీకాంత్ అనేయువకుడు నిరుద్యోగి. అయితే ఒక యాప్ లో పార్ట్ టైం జాబ్ కోసం అప్లై చేశాడు. ఇది గమనించిన సైబర్ కేటుగాళ్లు శ్రీకాంత్ ను టార్గెట్ చేశారు. అతనికి లింక్ పంపి.. కాల్ చేశారు. పార్ట్ టైం జాబ్ ఉందని కానీ.. దానికోసం ఒక టాస్క్ ఉంటుందని శ్రీకాంత్ ను నమ్మించారు కేటుగాళ్లు. అంతేకాకుండా పార్ట్ టైంలో ఎక్కువ మణి సంపాదించ వచ్చని తెలుపడంతో ఆశ పడ్డాడు శ్రీకాంత్. దీంతో టాస్క్ పూర్తి చేయాలంటే లక్షా 20 వేలు కడితే 2.50లక్షలు వస్తాయని చెప్పారు. అది నిజమని నమ్మిన శ్రీకాంత్ వారికి ఓటిపి, డబ్బులు మొత్తం పంపడం స్టార్ట్ చేశాడు. అత్యాశకు పోయి విడతల వారీగా 9 .79లక్షలు చెల్లించాడు. మళ్లీ సైబర్ కేటుగాళ్ల నుంచి కాల్ రావడం మరో 8లక్షలు పంపాలని ఒత్తిడి చేయడంతో శ్రీకాంత్ కు అనుమానం వచ్చింది. వారు పంపిన లింక్ లు అన్ని సర్చ్ చేయగా ఫేక్ అని లేలింది. దీంతో శ్రీకాంత్ మోస పోయినట్లు గుర్తించి సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. శ్రీకాంత్ చెప్పిన ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాజల్ బెడ్ రూం ఫోటోస్ వైరల్..

Exit mobile version