NTV Telugu Site icon

Cyber Criminals: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. టాస్క్ ల పేరుతో 11 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

Cyber Criminals

Cyber Criminals

Cyber Criminals: సంగారెడ్డి జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుంచి అధిక డబ్బు ఆశ చూపి రూ.41.29 లక్షలు కేటుగాళ్ళు కాజేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లాలో అమీన్ పూర్ లో ఉండే ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ పేరుతో మెసేజ్ వచ్చింది. దీంతో నిజమని నమ్మిన ఉద్యోగి మెసేజ్ కు రిప్లై ఇచ్చాడు. అంతే కేటుగాళ్లు ఈ ఉద్యోకి తలపై టోకరాపై పెట్టేశారు. పక్కా ఉద్యోగం వస్తుందంటూ నమ్మించారు. అయితే పార్ట్ టైం జాబ్ వస్తుందని భావించిన ఉద్యోగి వాళ్లు చెప్పిన ప్రాసెన్ ఫాలో అయ్యాడు. ఉద్యోగం కోసం విడతల వారిగా రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ తరువాత వారికి కాల్ చేసిన నో రెన్పాన్స్ దీంతో మోసపోయానని భావించిన ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉద్యోగం వస్తుందని మోసపోయానని, తన డబ్బులు తనకు ఇప్పించాలని కన్నీరుమున్నీరయ్యాడు. ఇక మరోవైపు పటాన్ చెరులో ఉండే మరో ఉద్యోగి నుంచి రూ. 11.29 లక్షలను టాస్క్ ల పేరుతో సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఆలస్యంగా గమనించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read also: MLC Jeevan Reddy: అనవసర ప్రాజెక్ట్ లు కట్టి రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారు..

ఇక తాజాగా వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన ఎన్‌.రాజేశ్‌ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే.. నగరంలోని ఎల్లారెడ్డి గూడలో విజయ రాజరాజేశ్వరి కనస్ట్రక్షన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో ఓ కార్యాలయాన్ని తెరిచాడు. అంతేకాకుండా.. తమ సంస్థలో పెట్టుబడి పెడితే అధిక శాతం రాబడి, వడ్డీలు ఇప్పిస్తానంటూ ప్రచారం చేశాడు. దీంతో.. తన స్నేహితులు, బంధువుల ద్వారా ఎంతోమందిని బుట్టలో వేసుకున్నాడు. ఇక రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వీఆర్‌ఆర్‌ గ్రూప్స్‌లో నగదు డిపాజిట్‌, పెట్టుబడితో ప్రతి ఏడాది 24 నుంచి 27శాతం వడ్డీ ఇస్తామని నమ్మించాడు. కాగా.. తమ రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా తాము నిర్మించే హోటళ్లతో లాభాల పంట పడుతుందంటూ బుట్టలో పడేశాడు. ఇక.. మొదట్లో కొందరికి నెలవారీ వడ్డీలు ఇవ్వడంతో ఇదంతా నిజమనే వారు నమ్మారు. దీంతో.. సుమారు 100 మంది ఇతడి మాటలు నమ్మి భారీఎత్తున అతడి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఇక నగరానికి చెందిన 29 మంది బాధితులు రూ.23 కోట్ల మేర ఆ సంస్థలో డిపాజిట్‌ చేశారు. అయితే.. ఈ నెల 2న కూకట్‌పల్లికి చెందిన ఐటీ నిపుణురాలు ఇచ్చిన ఫిర్యాదుతో వీఆర్‌ఆర్‌ సంస్థ, డైరెక్టర్లు రాజేశ్‌, వాణి, వినోద్‌రావు, రవి, బ్రహ్మయ్య, ఎం.రవి, ఏ.కృష్ణ, తాడిమెటీరావు తదితరులుపై నగర సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.