మోసానికి ఎవరైతే నేం అన్నట్టుగా ఉంది. హనుమకొండ జిల్లాలో ఓ బ్యాంకు ఉద్యోగి సైబర్ నేరగాళ్ల బారినపడ్డారు. తన ఖాతాలోంచి రూ.2,24,967 పోగొట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బిహార్‌కు చెందిన సకల్‌దేవ్ సింగ్ పరకాల ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. హనుమకొండలోని సుబేదారిలో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తుంటారు. గురువారం రాత్రి ఆయనకు ఓ మొబైల్ నంబరు నుంచి ‘మీ ఖాతా డీ యాక్టివేట్ అవుతుంది.. పాన్ కార్డు అప్‌డేట్ చేయండి’ అని మెసేజ్ వచ్చింది.
Read Also:Annamayya Project: ఇక చకచకా అన్నమయ్య ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులు
ఆయన శుక్రవారం ఉదయం ఆ మెసేజ్‌ను క్లిక్ చేసి.. అప్‌డేట్ చేయడానికి ప్రయత్నించగా సబ్‌మిట్ కాలేదు. అనంతరం మరో నంబరు నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. తాను చెప్పినట్టు చేయాలని అవతలి వ్యక్తి సూచించగా..’నేను బస్సులో ఉన్నాను.. తర్వాత చేస్తాను’ అని సకల్‌దేవ్ సింగ్ చెప్పారు. బ్యాంకుకు వెళ్లిన తర్వాత ఆయనే తనకు వచ్చిన నంబర్‌కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి పాన్ కార్డు అప్‌డేట్ చేయాలని సూచించగా కావడం లేదని చెప్పారు.ఆ వెంటనే వాట్సాప్‌నకు ఒక లింక్ పంపానని, దాన్ని ఓపెన్ చేయాలని అవతలి వ్యక్తి చెప్పాడు.
ఈమేరకు వేరే నంబరు నుంచి లింక్ పంపించగా.. దాన్ని ఓపెన్ చేశారు. దీంతో ఆయన ఖాతా లోంచి 3 లావాదేవీల్లో రూ.99,990, రూ.99,990, రూ.24,987 మాయమయ్యాయి. ఈమేరకు ఆయన శుక్రవారం రాత్రి పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.కిషన్ తెలిపారు. బ్యాంకు ఉద్యోగి డబ్బులు కాజేశారు సైబర్ నేరగాళ్లు. పరకాల లో అసిస్టెంట్ మేనేజర్ కు టోకరా వేశారు. మీకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే, లింక్ లు పంపాం.. ఓపెన్ చేయమని చెబితే మాత్రం మీరు స్పందించకండి. అనుమానాస్పద వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి.
Read Also:Nellore Church Blood: నెల్లూరు కబాడీపాలెంలో వింత.. శిలువ నుంచి రక్తం