వేప చెట్టునుంచి పాలు కారడం, కళ్ళు తెరచిన జీసస్, పాలు తాగుతున్న సాయిబాబా విగ్రహం.. ఇలా వింత వింత సంఘటనలు మనకు కొకొల్లలు. తాజాగా నెల్లూరు జిల్లాలో వింత చోటుచేసుకుంది. నగరంలోని కబాడీపాలెం చర్చిలో ఈ వింత బయటపడింది. పరిశుద్ధ కానుక మాతచర్చి లో వింతపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శిలువకు వేలాడుతున్న యేసు క్రీస్తు బొమ్మ చేతులు.. కాళ్లు చేతుల నుంచి ఎర్రటి ద్రవాలు కారుతున్నాయి. ఈ వింతను చూసేందుకు ఎగబడుతున్నారు జనం.
శిలువకు వేలాడ దీసి ఉన్న క్రీస్తు బొమ్మ చేతులు,కాళ్లకు దిగగొట్టిన మేకుల నుంచి ఎర్రటి ద్రవాలు కారుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో చర్చిలోకి ఇతరులను అనుమతించడం లేదు నిర్వాహకులు. ఈ వింత ద్రవాలు ఏంటని పరిశీలించాలని స్థానికులు అధికారులను. చర్చి నిర్వాహకులను కోరుతున్నారు. గతంలో వరంగల్ జిల్లాలో వింత చోటుచేసుకుంది.
భద్రకాళి అమ్మవారు అభిషేకం సమయంలో కళ్ళు మూసుకుని… తెరచుకుంటున్నట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమ్మవారి అభిషేక సమయంలో కళ్లు తెరవడం, మూయడం కనిపించింది. పూజారులు అమ్మవారికి జలాభిషేకం చేస్తూ.. తలమీద నుంచి నీరు పోస్తున్న సమయంలో ఆ తల్లి కళ్ళు తెరచి చూస్తుందని తెలిపారు. అయితే ఆ నీరు.. కనుల దగ్గరకు వచ్చే సరికి.. కళ్ళు మూసుకున్నట్లు కనిపిస్తోందని.. ఇదంతా అమ్మవారి లీల అంటూ గతఏడాది ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు చర్చిలో ఏం జరిగిందనేది తేలాల్చి ఉంది.
Read Also: Complaints to GHMC: కుక్కలు బాబోయ్ కుక్కలు.. జీహెచ్‌ఎంసీకి 36 గంటల్లో 15వేల కంప్లైంట్స్