NTV Telugu Site icon

‘గేట్‌ వే’పై సైబర్‌ ఎటాక్.. కోట్లలో కొట్టేశారు..!

ఒకప్పుడు దొంగతనం చేయాలంటే.. ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లాలి.. బెదిరించో.. అదిరించో.. ఇంకో విధంగానో అందినకాడికి దండుకునేవారు… కానీ, ఆధునిక యుగంలో అంతా మారిపోయింది.. అంతా స్మార్ట్‌ అయిపోయారు.. చివరికి దొంగలు కూడా టెక్నాలిజీని ఉపయోగించి స్మార్ట్‌గా కొట్టెస్తున్నారు.. తాజాగా, గేట్ వే సంస్థపై సైబర్ ఎటాక్‌ జరిగింది.. అరగంట వ్యవధిలో కోటి 28 లక్షల రూపాయలు కాజేశారట కేటుగాళ్లు.. ఇంకా భారీగానే కొట్టేసే ప్రయత్నం చేయగా.. అలారం మోగడంతో అప్రమత్తమైన ఆ సంస్థ అధికారులు.. ఆ ప్రయత్నాని అడ్డుకోగలిగారు.. ఇక, ఈ ఘటనపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పేమెంట్ గేట్ వే సంస్థకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు.. ఒడిశాకు చెందిన ఎలక్ట్రికల్ సంస్థ పేరుతో పేమెంట్ గేట్ వేలో మర్చంట్‌గా రిజిస్ట్రేషన్ చేయించుకున్న సైబర్ నేరగాళ్లు.. గేట్ వే సంస్థకు చెందిన అకౌంట్ నుండి కోటి 28 లక్షల రూపాయలు కాజేశారు.. మరింత డబ్బు బదిలీ చేస్తుండగా సర్వర్‌లో అలారం మోగడంతో అప్రమత్తమైన సంస్థ సిబ్బంది.. ఆ ప్రయత్నానికి బ్రేక్‌ వేశారు.. ఈ ఘటనతో అలర్ట్‌ అయిన సంస్థ పోలీసులను ఆశ్రయించింది.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పేమెంట్ గేట్ వే సీఈవో ప్రభాకర్.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.