Site icon NTV Telugu

CS Somesh Kumar : తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ రిలీవ్‌

Cs Somesh

Cs Somesh

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఇక్కడి విధుల నుంచి రిలీవ్‌ చేసింది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అయితే.. సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా.. ఎల్లుండిలోగా ఏపీ గవర్నమెంట్‌కు రిపోర్ట్‌ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. అయితే.. సోమేష్‌ కుమార్ మరో ఏడాదిలో రిటైర్‌ కానున్నారు. అయితే.. ఏపీకి వెళ్లేందుకు సోమేశ్‌ కుమార్‌ విముఖతగా ఉన్నట్లు.. ఈ క్రమంలోనే వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇదిలా ఉంటే.. తెలంగాణకు కొత్తగా సీఎస్‌ను నియమించనుంది కేంద్రం. కొత్త సీఎస్‌ రేసులో రామకృష్ణారావు, అరవింద్‌ కుమార్‌లు ఉన్నారు.

Also Read : Ramya Ragupathi: కృష్ణ గారిని నేను లాగలేదు.. నరేష్ ఆయనను బురదలోకి లాగాడు

అయితే.. ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్‌ సెక్రటరీగా రామకృష్ణరావు ఉన్నారు. తెలంగాణ సీఎస్‌ బాధ్యతలు తెలుగువారికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఏపీకి సీఎస్‌గా కేంద్రం సోమేశ్‌ కుమార్‌ను కేటాయించగా.. కేంద్రం ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణలో సోమేశ్‌ కుమార్ సీఎస్‌గా కొనసాగేలా క్యాట్‌ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 2017వ సంవత్సరంలో క్యాట్ ఉత్త‌ర్వులు కొట్టేయాల‌ని కోరుతూ కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో దీనిపై విచారణ జరిపిన సీజే ఉజ్జ‌ల్ భూయాన్ ధ‌ర్మాస‌నం మంగళవారం క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ తుది తీర్పు ప్రకటించింది. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ కేటాయింపును రద్దు చేస్తూ.. ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఈ క్రమంలో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ తో సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు.

Also Read : Massive Accident : సిద్ధిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Exit mobile version