Yadagirigutta: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం భారీగా క్యూ లైన్ లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుంటున్నారు. కార్తీక మాసం, దానికి తోడు ఆదివారం సెలవుదినం కావడంతో ఇష్టదైవాలయ దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్షేత్రాలకు చేరుకుంటున్నారు. పార్కింగ్ స్థలం వాహనాలతో నిండిపోయి, మైదానం చుట్టూ ఉన్న రింగ్ రోడ్డుపై కూడా వాహనాలు నిలిచిపోయాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సత్యదేవుని వ్రతం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపారాధనలు భక్తులతో కిటకిటలాడాయి.
Read also: Jagtial Road Accident: కుటుంబంలో విషాదం నింపిన రిసెప్షన్.. వధువు అన్న మృతి..
కొండపైనున్న గర్భగుడి వద్ద పంచనారసింహుని సమేతంగా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ప్రధాన ఆలయం, కల్యాణోత్సవం, వ్రత మండపాలు, ఆలయ తిరువీధులు, శివాలయం, ప్రసాద వెండశాల, కొండకింద వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట తదితర ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయానికి ఉత్తర దిశలో చిత్రపటాలు చేసేందుకు భక్తులు పోటీ పడ్డారు. అదేవిధంగా భక్తులను కొండపైకి తరలించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకస్వాములు స్వయంభువులకు సంప్రదాయబద్ధంగా నిత్యపూజలు నిర్వహించారు. కొండపై ఉన్న శివాలయంలో శ్రీరామలింగేశ్వర స్వామివారికి నిత్య పూజలు, రుద్రహవన పూజలు, శివగామరితితో పాటు శ్రీ పర్వతవర్ధిని నిర్వహించారు.
Read also: Dulquer Salmaan : రూ. 100 కోట్ల దిశగా లక్కీ భాస్కర్..
మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా భక్తుల రద్దీ నెలకుంది. ఆలయం ముందు భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండటంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈరోజు రేపు గర్భాశయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు.
Madhya Pradesh : ‘ఫెయిల్ చేస్తానని రష్మీ మేడమ్ బెదిరించింది’.. సూసైడ్ నోట్ రాసి ఫినాయిల్ తాగిన విద్యార్థిని