Site icon NTV Telugu

Tammineni Veerabhadram: టీఆర్ఎస్‌కు మద్దతు రాజకీయ ఎత్తుగడ.. త్వరలో పాదయాత్ర..

Tammineni Veerabhadram

Tammineni Veerabhadram

తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కాకరేపుతోంది.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీలో చేరి మరరోసారి బరిలోకి దిగనుండగా.. అభ్యర్థుల ఎంపిక వేటలో పడిపోయాయి.. అధికార టీఆర్ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు.. అయితే, మునుగోడులో కమ్యూనిస్టు పార్టీలో టీఆర్ఎస్‌ పార్టీకే తమ మద్దతు అని తేల్చేశాయి.. ఈ విషయంలో సీపీఐ ముందుండగా.. ఆ తర్వాత కాస్త సమయం తీసుకుని సీపీఎం కూడా గులాబీ పార్టీకే తమ మద్దతు అని తేల్చేసింది.. ఇక, ఈ పరిణామాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం… టీర్ఎస్‌కి మద్దతు ఇచ్చినంత మాత్రాన ఉద్యమాలు ఆగవు అని స్పష్టం చేశారు.. టీఆర్ఎస్‌కి మద్దతు ఒక రాజకీయ ఎత్తుగడగా పేర్కొన్న ఆయన.. త్వరలో భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

Read Also: TTD: ఆ భక్తుడికి రూ.50 లక్షలు ఇవ్వండి.. టీటీడీకి కోర్టు ఆదేశాలు..

ఇక, నా కుటుంబం మీద వచ్చిన హత్యా ఆరోపణలకు.. మునుగోడులో టీఆర్ఎస్‌కు మద్దతుకు సంబంధం లేదని స్పష్టం చేశారు తమ్మినేని వీరభద్రం.. మేం హత్యా రాజకీయాలకు వ్యతిరేకం.. నేను ఎవరిని భయపెట్టను.. ఆ అవసరం లేదన్నారు.. అయితే, తెలంగాణ పై బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు తమ్మినేని.. టీఆర్ఎస్‌-బీజేపీ ఒకటేఅని కాంగ్రెస్ చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించిన ఆయన.. బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిలబడ్డారని తెలిపారు తమ్మినేని.. కాగా, తమ్మినేని సొంత ఊరు తేల్దార్‌పల్లిలో టీఆర్ఎస్‌ నేత, తమ సమీప బంధువు తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురికావడం కలకలం రేపింది.. ఈ హత్య కేసులో తమ్మినే వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావుపై పోలీసులు అభియోగాలు మోపిన విషయం తెలిసిందే.

Exit mobile version