Site icon NTV Telugu

D. Raja: మోడీని నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్ యే..! మోడీ హయాంలో యువతకు భవిత లేదు

D. Raju

D. Raju

మోడీ హయంలో యువతకు భవిష్యత్తు లేదని, మోడీని నడిపిస్తుంది ఆర్‌ఎస్‌ఎస్‌ యే అంటూ Cpi జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా మండిపడ్డారు. ఈ దేశానికి సోషలిజం ఒక్కటే ప్రత్యామ్నాయమన్నారు. కొన్ని ఫార్మా కంపెనీలు కరోనా సమయంలో దేశ ప్రజలను లూటీ చేశాయని తెలిపారు. కమ్యూనిస్టుల ఐక్యం అయితే ప్రజలు అధికారం వైపు తీసుకు వెళ్తారని పేర్కొన్నారు. మోడీ హయంలో యువతకు భవిష్యత్తు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదలు పేదలుగానే ఉంటున్నారన్నారు. మోడీని నడిపిస్తుంది ఆర్‌ఎస్‌ఎస్‌ యే అని నిప్పులు చెరిగారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలే మోడీ అమలు చేస్తున్నారని డి. రాజా తెలిపారు. Rss దేశ ప్రజలను తప్పు దోవ పట్టిస్తుందని పేర్కొన్నారు. దేశంలో అన్ని మతాలు.. అన్ని భాషలూ మాట్లాడే వారు ఉన్నారని స్పష్టం చేశారు. కానీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అలా చెప్పడం లేదని మండిపడ్డారు. మోడీ ఆర్ధిక విధానాలు దేశాన్ని సంక్షోభం లోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ సెక్టార్.. నీ ప్రైవేట్ పరం చేస్తుందని గుర్తు చేశారు. కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం అండగా నిలబడుతుందని అన్నారు. మోడీ విధానాలు వ్యతిరేకించడంతోపాటు ప్రత్యామ్నాయ విధానాలు చూపెడదామని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలు కూడా చూపెడుదామని స్పష్టం చేశారు డి.రాజా.

నిన్న ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సీపీఐ రాష్ట్ర మూడో మహాసభలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జెడ్‌పీ హైస్కూల్‌ గ్రౌండ్‌ లో జరిగిన బహిరంగసభలో డి. రాజా మాట్లాడారు. ఇక మోడీ ప్రభుత్వ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని, రూపాయి విలువ పతనమైందని, నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. దీంతో.. వర్గ, కుల రహిత సమాజం ఎర్రజెండాతోనే సాధ్యమని, దేశప్రజల ఆశ, భవిష్యత్తు ఎర్రజెండానే అని అన్నారు. ఇక తెలంగాణ నేల విప్లవాల గడ్డ అని, నిజాం రాచరికం నుంచి విముక్తికి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో అద్భుతమైన పోరాటం జరిగిందని తెలిపిన విషయం తెలిసిందే.
Allari Naresh : ‘ఉగ్రం’ మొదలైంది!

Exit mobile version